Book Title: Who Am I
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 9
________________ తొలి పలుకు జీవించటం వేరు. బ్రతకటం వేరు. బ్రతకటం కంటే జీవించటం ఎంతో ఉన్నత మైనది. గాలి పీల్చడం, తినటం మొదలైనవి బ్రతుకుకి గుర్తులు; ఆధ్యాత్మిక వికాసం, ఆత్మోన్నతి, ఆనందంగా జీవించుచున్నదానికి గుర్తులు. జీవితం ఒక ఉన్నత లక్ష్యం కలిగి ఉండాలి. 'నేనెవరిని?' అనే ప్రశ్నకు నిజమైన సమాధానాన్ని పొందటమే మానవ జన్మ పరమార్ధం. గత అనంతజన్మలుగా ఇది సమాధానంలేని ప్రశ్నగానే మిగిలిపోయింది. అందువల్లనే ఈ సంసారచక్రంలో పరిభ్రమణకి అంతం లేకుండా ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం ఎలా దొరుకుతుంది?. తనను తాను తెలిసికొన్న జ్ఞాని ఇతరులకు తేలికగా వారి స్వరూపాన్ని తెలియచేయగలడు. అది జ్ఞానిపురుషుని దివ్యశక్తి. ఈ ప్రపంచంలో ఎవరికైతే తెల్సుకోవలసినదిగాని, చేయవలసినదిగాని ఏమీ మిగిలి ఉండదో అతడేజ్ఞాని. అటువంటి జ్ఞాని పురుషులైన పరమపూజ్య దాదాశ్రీ ఈ కాలంలో మనమధ్యకు వచ్చి మనకు బోధపడే సరళమైన భాషలో సహజమైన పద్ధతిలో “ నేనెవరిని?” అనే ప్రతిఒక్కరి ప్రధానప్రశ్నకి సమాధానం చెప్పారు. నేను ఎవరు? నేను కానిది ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? ఏది నాది? ఏది నాది కాదు? బంధం ఏమిటి? మోక్షం ఏమిటి? భగవంతుడున్నాడా? భగవంతుడంటే ఏమిటి? ఈ ప్రపంచంలో కర్త ఎవరు? కర్త భగవంతుడా? కాదా? భగవంతుని నిజ స్వరూప స్వభావం ఏమిటి? ప్రపంచంలో నిజమైన కర్త యొక్క స్వభావం ఏమిటి? ప్రపంచాన్ని ఎవరు నడుపుతున్నారు? అది ఎలా పనిచేస్తుంది? మాయయొక్క నిజ స్వభావం ఏమిటి? మనిషి తెల్సుకొన్నది ఏదైనా అది వాస్తవమా లేక భ్రమా? మనిషి తనకు కలిగిన జ్ఞానం వల్ల ముక్తిని పొందగల్గుతున్నాడా లేక బద్ధుడిగానే మిగిలి పోతున్నాడా ? ఈ ప్రశ్నలన్నింటి వెనుక ఉన్న అక్రమవిజ్ఞానం (సూటిగ మోక్షానికి చేర్చే లిఫ్ట్ మార్గము యొక్క జ్ఞానం) యొక్క సారాంశం కూడ ఈ పుస్తకం ద్వారా పాఠకులకు పరిచయం చేయబడింది. 8 డా. నీరుబెన్ అమీన్

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90