________________
65
నేను ఎవరిని ?
తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరాలి. నీ పొరపాట్లను నీవు గుర్తించిన వెంటనే ఈ పని చేయాలి. ఈ విధంగా చేస్తుండటం వల్ల నీ తప్పులు తగ్గటం, క్రమేపి తప్పులు తొలగిపోవడం జరుగుతుంది.
ప్రశ్నకర్త : ఒక వ్యక్తి పట్ల ప్రతిక్రమణ ఏ విధంగా చేయాలి? దాదాశ్రీ : ఏవ్యక్తిని నువ్వు గాయపరిచావో ఆ వ్యక్తి యొక్క దేహనామాలకు, మనోవాక్కాయాలకు, భావ, ద్రవ్య, నో కర్మలకు (భావరూపంలో పూర్వ సంచిత ఛార్జికర్మ, ఇపుడు క్రియారూపందాల్చిన కర్మ, పూర్తి అయిన కర్మ), అతీతమైన శుద్ధాత్మను నీవు స్మరించాలి. ఈ విధంగా ఆ వ్యక్తి యొక్క శుద్ధాత్మను గుర్తు తెచ్చుకోవాలి. అపుడు 'చందు లాల్' తన తప్పులను, పొరపాట్లను ఆలోచన (ఆత్మావలోకనం) ద్వారా గుర్తించాలి. ఆ తప్పులకు పశ్చాత్తాపం చెంది క్షమాపణకై వేడుకోవాలి, ఆ తప్పుల్ని మరల చేయనని ప్రతిజ్ఞ చేయాలి. నీవు శుద్ధాత్మవు, 'చందులాల్' ప్రతి క్రమణ ఎలా చేస్తున్నదీ, ఎంత నిజాయితీగా చేస్తున్నది నీవు
గమనించాలి.
'నేను ఈ శరీరము' అనేది దేహాధ్యాస సాధారణంగా ఈ ప్రపంచ జనులు 'నేను ఈ శరీరాన్ని' అనే జ్ఞానాన్ని త్యజించలేరు. వారు తమ నిజ స్వరూపాన్ని ఎరుగరు. ఏదో విధంగా నీవు ఈ జ్ఞానాన్ని పొంది ఇపుడు అహంకార రహితుడవయ్యావు. 'నేను చందులాల్' అనే భావన అహంకారం. శుద్ధాత్మజ్ఞానం నెలకొల్పబడినపుడు దేహం మీద కానీ, దానికి సంబంధించిన వాటిమీదగాని మమకారం ఉండదు. అయినప్పటికీ ప్రారంభంలో నీవు పొరపాట్లు చేయడమూ, ఒక విధమైన ఊపిరి సలుపనటువంటి అసౌకర్యాన్ని అనుభవించటమూ జరగవచ్చు.
లోపలినుంచే ప్రజ్ఞ నిన్ను అప్రమత్తం చేస్తుంది.
ఈ జ్ఞానము విజ్ఞాన శాస్త్ర సంబంధమైనది కనుక, అది క్రమంగా వృద్ధి చెందటం నీకు అనుభూతమౌతుంది. లోపలినుండే అది తనంత తానుగా నిన్ను అప్రమత్తం చేస్తుంది. నీవు చేయవలసినది ఏమీ లేదు. కాని పరంపరానుగత ఇతర క్రమ మార్గానికి