________________
నేను ఎవరిని ? జన్మలలో మహా విదేహ క్షేత్రంలో తీర్ధంకరులైన శ్రీ సిమంధరస్వామి దర్శన భాగ్యాన్ని పొందిన తరువాత వారు మోక్షాన్ని పొందుతారు. ఇదే ఈ మార్గం యొక్క సరళత మరియు సులభత్వం. నా ఆజ్ఞలలో ఉండాలి. ఆజ్ఞలే ధర్మము మరియు ఆజ్ఞలే తపము. సమభావంతో మీరు మీ ఫైల్స్ అన్నింటినీ పూర్తి చేసుకోవాలి. ఎంతగా ఆజ్ఞలను పాటించగలిగితే అంత ఎక్కువగా పాటించండి. ఆజ్ఞలను స్థిరంగా పూర్ణరూపంలో పాటించగలిగితే భగవాన్ మహావీర్ స్థితిని మీరు పొందవచ్చు. మీరు అనాత్మను మరియు ఆత్మను చూస్తూపొండి. అపుడు మీ చిత్తం అటూయిటూ పరుగులెత్తదు. కాని ఆసమయంలో మనసులో కొత్త ఆలోచనలు తలెత్తితే కొత్త ప్రశ్నల సృష్టి జరుగుతుంది.
ఈ జ్ఞానానంతరం మీరు ఐదు ఆజ్ఞలను పాటించినచో భగవాన్ మహావీర్ పొందిన బ్రహ్మానందాన్ని పొందుతారు. నేను సదా అదే ఆనందంలో ఉంటాను. నేను ఏ మార్గాన్ని అనుసరించానో అదే ఆనందంలో ఉంటాను. నేను ఏ మార్గాన్ని అనుసరించానో అదే మీకు చూపిస్తున్నాను. నిజమైన రాజ్యంలో (ఆత్మ స్వరూప స్థితిలో) మీ ఆధ్యాత్మిక జాగృతి, నా ఆధ్యాత్మిక జాగృతి ఒక్కటే.
(13) ఐదు ఆజ్ఞల ప్రాముఖ్యత
జ్ఞానానంతరం ఆధ్యాత్మిక సాధన ప్రశ్నకర్త : ఈ జ్ఞానానంతరం ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేయవలసి వుంటుంది?
దాదాశ్రీ : ఈ ఐదు ఆజ్ఞలను పాటించటమే ఏకైక సాధన. వేరే ఏ సాధనా లేదు. మిగిలిన సాధనలన్నీ బంధ హేతువులు. ఈ ఐదు ఆజ్ఞలు మిమ్ము బంధవిముక్తుల్ని చేస్తాయి.
ఆజ్ఞలవల్ల పరమానందం ప్రశ్నకర్త : మీ ఐదు ఆజ్ఞలకంటే శ్రేష్ఠమైనది ఏమైన ఉన్నదా? దాదాశ్రీ : ఈ ఐదు ఆజ్ఞలు మీ అమూల్యనిధిని కంచెలా రక్షిస్తాయి. ఈ కంచెను మీరు పూర్తిగా మూసి వుంచినట్లయితే, నేను మీకు ప్రసాదించిన అమూల్యనిధిని ఎవరూ అపహరించలేరు. ఈ ఐదు ఆజ్ఞలు అనే కంచె బలహీనపడితే ఎవరో ఒకరు