________________
73
నేను ఎవరిని ?
మీరు ఆజ్ఞలను పాటించినట్లయితే పని పూర్తవుతుంది. నేను ఈ ఆజ్ఞలను సదా పాటిస్తాను. నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితినే మీకు ప్రసాదించాను. ఆజ్ఞలను పాటించినపుడే అది ఫలితాన్నిస్తుంది. స్వయం కృషితో ఎవరైనా దీనిని పొందాలని ప్రయత్నిస్తే ఒక వంద వేల (లక్ష) జన్మల తర్వాత కూడ విజయాన్ని పొందలేరు. ఆజ్ఞలను పాటించాలన్న భావన ఉన్నప్పటికీ, బుద్ధి మాద్యమం ద్వారా ఆజ్ఞలను పాటించినందువల్ల అది వారి ఆజ్ఞల రక్షణగోడను బలహీనపరచటానికి ఉపయోగపడిన సందర్భాలున్నాయి. అందువల్ల మీరు అప్రమత్తంగా శ్రద్ధతో ఉండవలసిన అవసరం ఉన్నది.
మీరు ఆజ్ఞలను పాటించటం మరిచినట్లయితే ప్రతిక్రమణ చేయాలి. మరపు మానవనైజం. మరిచిపోయినపుడు “దాదా! దయతో నన్ను క్షమించండి. నేను ఈ రెండు గంటలూ ఆజ్ఞలను పాటించటం మర్చిపోయాను. నేను మీ ఆజ్ఞలను పాటించగోరుతున్నాను. దయ చేసి నన్ను క్షమించండి” అని చెప్పటం ద్వారా ప్రతిక్రమణ చేయాలి. ప్రతిక్రమణ ద్వారా, మీ బాధ్యతనుంచి మీరు విడుదల పొందుతారు.
ఒకసారి మీరు ఆజ్ఞల రక్షణ పరిధిలోనికి వచ్చినట్లయితే ప్రపంచంలో ఏదీ మిమ్మల్ని బాధించదు. కర్మ మిమ్మల్ని బంధించదు. అయితే ఆజ్ఞలను ఇచ్చినవారిని బంధిస్తుందా? లేదు, ఎందువల్లనంటే అవి పరులహితాన్ని కోరి యివ్వబడినవి కనుక.
ఇవి భగవంతుని యొక్క ఆజ్ఞలు. దాదాజీ యొక్క ఆజ్ఞలను పాటించడం అంటే ఎ.ఎమ్.పటేల్ యొక్క ఆజ్ఞలను పాటించటం అని అర్ధం కాదు. ఇవి చతుర్దశ భువనాలకు ప్రభువైన దాదా భగవాన్ ఆజ్ఞలు. దీనికి నేను గ్యారంటీ యిస్తున్నాను. అవును. అవి నా మాద్యమం ద్వారా మీకు లభిస్తున్నాయి. వాటిని పాటించండి. నేను కూడ స్వయంగా దాదాభగవాన్ యొక్క ఈ ఆజ్ఞలలో ఉంటాను.
జై సచ్చిదానంద్