________________
శుద్ధాత్మకి ప్రార్ధన
హే అంతర్యామీ పరమాత్మా! నీవు నాలో ఉన్నవిధంగానే జీవులందరిలో విరాజమానమై వున్నావు. నీ యొక్క దివ్య స్వరూపమే నా నిజ స్వరూపము. నా నిజ స్వరూపము పవిత్ర ఆత్మ'.
హే శుద్ధాత్మ భగవాన్! నేను నీకు అభేదభావముతో అత్యంత భక్తిపూర్వకంగా నమస్కరించుచున్నాను. అజ్ఞానవశాత్తు నేను చేసిన తప్పులనన్నింటిని ఈ నీ ముందు ఒప్పుకొనుచున్నాను. నేను ఈ తప్పులకు పశ్చాత్తాపం చెందుతూ నీ క్షమకై అర్ధిస్తున్నాను. ప్రభూ! దయతో నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఆ తప్పులను మరల చేయకుండునట్లు నాకు శక్తిని ప్రసాదించు.
హే శుద్ధాత్మ భగవాన్! మాకు నీతోగల భేదభావము తొలగిపోయి మేమందరము నీతో అభేదతను పొందునట్లు ఆశీర్వదించు. మేము సదా నీతో అభేదతతో తన్మయాకారతను చెందెదము గాక!
( * గతంలో నీవు చేసిన తప్పులను గుర్తు తెచ్చుకోవాలి)
ప్రతిక్రమణ దివ్యమైన క్షమాపణా విధానము
నేను దాదా భగవాన్ సాక్షిగా
కంటె పూర్తిగా వేరైన పవిత్రాత్మకు నమస్కరించుచున్నాను. నేను నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొన్నాను (ఆలోచన)
ఆ తప్పులకై నేను క్షమాపణ కోరుచున్నాను (ప్రతిక్రమణ)
ఆ తప్పులను మరల చేయనని దృఢముగా నిశ్చయించుకొనుచున్నాను (ప్రత్యాఖ్యాన్) ప్రియాతి ప్రియమైన దాదాభగవాన్! ఈ దృఢ నిశ్చయమును పాలించు శక్తిని నాకు
----యొక్క మనోవచన కాయము
అనుగ్రహించు.
* మీ వలన గాయపడిన వ్యక్తి పేరు
** ఆ వ్యక్తిపట్ల మీరు ఒనర్చిన దోషాలను గుర్తుచేసుకోవాలి.