Book Title: Who Am I
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 86
________________ ఎవరైన అట్లు పలుకుటకు నేను కారణము కాకుండునట్లు, ఎవరుగాని అట్లు పలుకుటను నేను ఆమోదించకుండునట్లు నాకు పరమశక్తిని ప్రసాదించు. - ఎవరైనా పరుషవాక్యాలను గాయపరిచే విధంగా పలికినప్పటికీ నేను మృదుభాషను, సరళమైన భాషను పలుకుటకు నాకు శక్తినిమ్ము. 6. ప్రియాతి ప్రియమైన దాదాభగవాన్! స్త్రీ, పురుషుడు, నపుంసకుడు ఏ లింగధారియైనప్పటికి, ఏ దేహధారి జీవాత్మపట్ల కూడా నాకు కించిత్ మాత్రమైన విషయవికార సంబంధమైన దోషములు, వాంఛలు, చేష్టలు, విచారములు కలుగకుండునట్లు; ఇతరులకు అవి కలుటకు నేను కారణము కాకుండునట్లు, ఎవరుగాని వాటిని కలిగియుండుటను నేను ఆమోదించకుండునట్లు నాకు పరమశక్తిని అనుగ్రహించు. నిరంతరము నిర్వికారిగా ఉండుటకు నాకు అనంతమైన శక్తినిమ్ము. 7. ప్రియాతి ప్రియమైన దాదా భగవాన్ ! ఆహార విషయంలో నాకు జిహ్వాచాపల్యము లేకుండునట్లు శక్తినిమ్ము. సాత్వికమైన సమతులాహారము తీసికొనుటకు నాకు పరమశక్తినిమ్ము. 8. ప్రియాతి ప్రియమైన దాదా భగవాన్ ! ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని, జీవించి ఉన్న లేక మృతుడైన ఏ దేహధారి జీవాత్మనుగాని నేను విమర్శించకుండునట్లు, వారి పట్ల అపరాధము చేయకుండుటకు, అవినయముగా ప్రవర్తించకుండునట్లు, ఇంకొకరు ఆవిధముగా ప్రవర్తించుటకు నేను కారణము కాకుండునట్లు, వారిని నేను ఆమోదించకుండునట్లు నాకు పరమశక్తినిమ్ము. 9. ప్రియాతి ప్రియమైన దాదా భగవాన్! జగత్ కళ్యాణ కార్యములో సాధనముగ మారుటకు నాకు పరమశక్తినిమ్ము, శక్తినిమ్ము, శక్తినిమ్ము (దాదా భగవాన్ జీవులందరిలో విరాజమానుడైన పరమాత్మ, పై విధంగా భగవంతుని అర్ధించాలి. ఇది ప్రతి దినముయాంత్రికంగా చదువుటకు కాదు, హృదయంలో నిలుపుకోవాలి. దైనందిన జీవితంలో వీటిని అమలుపరచాలన్న దృఢ నిశ్చయంకలిగి దీనిని ప్రతిరోజూ చదవాలి. ఈ అమూల్య నవరత్నాలలో సమస్త శాస్త్రాల సారము ఇమిడి ఉన్నది.)

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90