________________
(5)
ను
ప్రాత: విధి శ్రీ సిమంధర స్వామికి నా నమస్కారము. వాత్సల్యమూర్తి దాదాభగవాన్ కి నా నమస్కారము.
ఈ మనోవచన కాయముల ద్వారా ప్రపంచములోని ఏ జీవికి కించిన్మాత్రము కూడా దు:ఖము కలుగకుండుగాక.
(5) కేవలం శుద్ధాత్మానుభవం మినహా, ఈ ప్రపంచంలోని ఏ నశ్వర వస్తువు నందు నాకు కోరికలేదు.
(5)
జ్ఞానిపురుష్ దాదాభగవాన్ యొక్క ఐదు ఆజ్ఞలలో సదా నిలిచి యుండుటకు అనంతమైన శక్తి నాకు లభించుగాక.
(5)
జ్ఞాని పురుష్ దాదాభగవానుని వీతరాగ విజ్ఞానం సంపూర్ణంగా, సర్వాంగంగా
కేవళ జ్ఞాన్, కేవళ్ దర్శన్ మరియు కేవళ్ చారిత్ర (కేవలం ఆత్మగా వర్తించటం) రూపంలో నాలో ప్రకటితమగుగాక.
(5)
నమస్కార విధి ప్రత్యక్ష దాదాభగవాన్ సాక్షిగా, వర్తమానంలో మహావిదేహ క్షేత్రంలో విహరించుచున్న తీర్ధంకర భగవాన్ శ్రీ సిమంధరస్వామికి అత్యంత భక్తి పూర్వకముగా నేను నమస్కరించుచున్నాను.
(40) ప్రత్యక్ష దాదాభగవాన్ సాక్షిగా, వర్తమానంలో మహావిదేహ్ త్రం మరియు ఇతర క్షేత్రములలో విహరించు ఓం పరమేష్టి భగవంతులకు అత్యంత భక్తిపూర్వకంగా నేను నమస్కరించుచున్నాను. ప్రత్యక్ష దాదాభగవాన్ సాక్షిగా, వర్తమానంలో మహావిదేహ క్షేత్రం మరియు ఇతర క్షేత్రములలో విహరించు పంచ పరమేష్టి భగవంతులకు అత్యంత భక్తి పూర్వకంగా నమస్కరించుచున్నాను.
(5)