________________
నేను ఎవరిని ?
లోన ప్రవేశించి వస్తువులను పాడుచేసే అవకాశం ఉంది. అపుడు నేనువచ్చి ఆకంచెను మరమ్మత్తు చేయాల్సి వస్తుంది. అందువల్ల మీరీ ఐదు ఆజ్ఞలలో ఉన్నట్లయితే మీ శాశ్వతానందానికి నేను గ్యారంటీ యిస్తాను.
71
ఈ ఐదు ఆజ్ఞలు మీ రక్షణ కోసం యివ్వబడినవి. నేను మీకు జ్ఞానం యిచ్చాను. మరియు భేదజ్ఞానం ద్వారా మిమ్మల్ని వేరు చేశాను. మీరు (అనాత్మనుంచి) ఇలాగే వేరుగా కొనసాగటం కోసమూ, ఇంకా ఎక్కువ రక్షణకోసమూ మీకు ఈ ఐదు ఆజ్ఞలను ఇచ్చాను. ఈ కలికాలంలో (వంచన, చీకటికాలం) రక్షణలేకుంటే ఈ అమూల్యజ్ఞాననిధిని ఎవరైనా దోచుకోవచ్చు. జ్ఞానబీజం మహావృక్షంగా వృద్ధి పొందాలంటే దానికి నీళ్ళు పోసి, పోషణ చెయ్యాలి. ఆ చిన్ని మొలకకు రక్షణగా చిన్న కంచెను ఏర్పాటు చెయ్యాలి. ఐదు ఆజ్ఞలు పరమాత్మదశకు దారితీస్తాయి.
దాదాశ్రీ : ఈ ఐదు ఆజ్ఞలు చాలా సరళమైనవి. అవునా?
ప్రశ్నకర్త : కానీ దైనందిన అనుభవంలో అవి కష్టంగా అన్పిస్తాయి.
దాదాశ్రీ : అవి కష్టమైనవి కాదు. అధికమైన మీ పూర్వజన్మసంచిత కర్మ డిశ్చార్జి అవుతుండటం (వెలికి వస్తుండటం వల్ల అవి అలా కన్పిస్తాయి. అటువంటి సమయాలలో మీరు ఎక్కువ జాగ్రత్త వహించవలసి వుంటుంది. అట్టి సందర్భాలలో ఆధ్యాత్మిక సోమరితనం కొంచెం కూడ పనికిరాదు. మీరు నా ఆజ్ఞలలో ఉన్నచో మహావీర్ భగవాన్ పొందిన సమాధి అనుభూతిని పొందగలరు. పూర్వపు మీ మానసిక వృత్తులు మిమ్మల్ని ఆజ్ఞలలో ఉండనీయవు. జ్ఞాత - జ్ఞేయము స్థితిని (యదార్ధ స్థానంలో ఉన్న 'నేను' జ్ఞాతగా లేక ద్రష్టగా మరియు ఫైల్ నెంబర్ వన్, చందూలాల్, జ్ఞేయముగా) కాపాడుకొనటం ద్వారా, నీవు నీ మానసిక ప్రవృత్తులకు అతీతంగా వుండవచ్చు. ఈ మనో వ్యాపారాలకు చోటు యివ్వరాదు. పూర్వపు ఏ ప్రవృత్తుల పట్ల | హర్షం చెందరాదు. లేకుంటే అవి వేరే విధంగా బహిర్గతమై నీ చుట్టూ నృత్యం చేయవచ్చు. నిన్ను వశీకరణం చేసుకోవచ్చు. దాని అర్ధం నీవు పతనమయ్యావని కాదు. అవి ఇతర ఆందోళనలకు, కష్టాలకు హేతువు కూడ కావచ్చు. ఇదే జరిగితే నీ నిజమైన ఆనంద స్థితికి ఆవరణ ఏర్పడుతుంది. నీ శాంతికి అంతరాయం ఏర్పడితే దానికి కారణం ఈ పూర్వపు ప్రవృత్తులే.
గానీ