________________
69
నేను ఎవరిని ?
దర్శనము (యదార్ధ దర్శనము), చారిత్ర (సత్ప్రవర్తనము) మరియు తపము అనేవి మోక్షానికి నాలుగు స్తంభాలు. ఆజ్ఞాపాలనకి ప్రత్యక్ష ఫలము స్వేచ్ఛ, ఎందుకనగా ఈ నాల్గుస్తంభాలు వాటిలో ఇమిడి వున్నాయి.
జ్ఞాని వద్ద ఉండు ఇంతకు ముందెన్నడూ జ్ఞానిపట్ల ప్రేమ కలుగలేదు. ఒకసారి ఈ ప్రేమ భావం ఉత్పన్నమైతే అన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. గత జన్మలలో నీ భార్యా బిడ్డల పట్ల ప్రేమ వల్ల నీవు పొందినది ఏమీలేదు. ఒకసారి
జ్ఞానిపురుషుని నుండి జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆవ్యక్తి
జ్ఞానివద్దనే ఉండాలనేది భగవంతుని ఉవాచ. ప్రశ్నకర్త : ఏ విధంగా మేము జ్ఞానితో ఉండాలి? దాదా శ్రీ : ఈ జ్ఞానం లభించిన తర్వాత మీకు జ్ఞాని వైపు తప్ప వేరే ఏ దిశలోనూ ఆరాధన ఉండదు. ఇది అక్రమ విజ్ఞానమని మాకు తెలుసు. ప్రజలు తమతో అసంఖ్యాకమైన ఫైల్స్ ను తెచ్చుకొన్నారు కనుక వారు వెళ్లి తమ ఫైల్స్ వ్యవహారాలను నిర్వహించుకోవటానికి నేను వారికి స్వేచ్ఛనిచ్చాను. నేను మిమ్మల్ని పూర్తిగా వెళ్ళిపోనివ్వటం లేదు. మీరు సమభావంతో మీ ఫైల్స్ ను నిర్వహించుకోవటం కోసమే నేను మిమ్మల్ని వెళ్ళనిస్తున్నాను. లేదంటే మీరు జానివద్ద ఉండిపోవటమే మంచిది.
అంతేకాక, జ్ఞాని సాన్నిధ్యంలో ఉండే అవకాశాన్ని, సత్సంగంద్వారా జ్ఞానాలాభాన్ని పూర్తిగా పొందే అవకాశాన్ని కోల్పోయినందుకు మీలో మీరు పగలు రాత్రి బాధపడ్తుంటారు.
జ్ఞానితో ఉండే అవకాశాన్ని పెంచుకోవాలన్న ఒక్క కోరిక మాత్రమే మీకు ఉండాలి. మీ ఫైల్స్ (సంసార బాధ్యతలు) తగ్గిపోవాలని, తద్వారా మీరు స్వేచ్ఛగా జ్ఞాని సాన్నిధ్యంలో ఉండాలని మీకు అంతరంగంలో కోరిక ఉండాలి.
అటువంటి వ్యక్తికోసం మహావిదేహ క్షేత్రం ఎదురు చూస్తుంది.ఎవరిలో శుద్ధాత్మ జాగృతి స్థాపించబడిందో వారు భరతక్షేత్రంలో (ప్రపంచంలో) ఉండలేరు. ఎవరి ఆత్మ జాగృతమౌతుందో వారు మహా విదేహ క్షేత్రానికి చేరతారు, ఇది నియమం. వారు ఈ దోష భూయిష్టమైన ప్రస్తుత కలికాలంలో ఉండజాలరు.ఇంకా ఒకటి లేక రెండు