________________
నేను ఎవరిని ?
68
ఇంకా ఏమి మిగిలివుంటుంది?
ఇంకొక మార్గం క్రమమార్గం. ఇది అక్రమ విజ్ఞానం. ఇది వీతరాగపురుషుల, పూర్ణప్రకాశస్వరూపుల, సంపూర్ణజ్ఞానుల యొక్క జ్ఞానము. ఈ రెండు మార్గాల జ్ఞానంలో భేదం లేదు.
ఈ జ్ఞానానంతరం నీవు ఆత్మానుభూతిని పొందుతావు. నీవు చేయటానికి ఇంకా ఏముంది? నీవు చేయవలసిందల్లా జ్ఞాని పురుషుని ఆజ్ఞలను పాటించటమే. ఈ ఆజ్ఞలే నీకు ధర్మము, ఆజ్ఞలే నీకు తపస్సు. నా ఆజ్ఞలు ప్రాపంచిక వ్యవహారాలలో నీకు ఎటువంటి నిర్బంధాలనూ కల్గించవు. నీవు సంసారంలో కొనసాగినప్పటికీ సంసార జీవితం నిన్ను ప్రభావితం చేయదు. అక్రమ విజ్ఞానం యొక్క మాహాత్మ్యం అంత గొప్పది.
ఈ అసాధారణ విజ్ఞానం ఎంత ఆశ్చర్యకరం అంటే అది లోపలినుంచే నీ నిజ స్వరూపంలో నీవు స్థిరపడేలా నిన్ను సదా అప్రమత్తం చేస్తుంది. ఎవరైనా వ్యతిరేక చర్యలకు పాల్పడినప్పటికీ ఆ వ్యక్తి వెంటనే లోపలి నుండే హెచ్చరింపబడతాడు. అందువల్ల నీవు ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఈ విజ్ఞానశాస్త్ర జ్ఞానమే అన్ని బాధ్యతలను స్వీకరిస్తుంది. నీవు చేయవలసినదల్లా ఇప్పటినుంచి దాదా శ్రీ ఆజ్ఞలను పాటించాలని దృఢంగా నిశ్చయించుకోవడమే. ఈ ఆజ్ఞలు నిన్ను అన్ని రకాల ప్రభావాలనుంచి రక్షిస్తాయి. నిద్రలో కూడ నీకు హెచ్చరికలు వస్తాయి. ఇంతకంటే ఎక్కువ నీకేమి కావాలి? ఇంకొక్క జన్మలో నీవు ముక్తి పొందదల్చుకొంటే నా ఆజ్ఞలను పాటించు. ఆజ్ఞయే ధర్మము.
ముక్తి పొందదల్చుకొన్నవారికి కర్మల ఆవశ్యకతలేదు. ముముక్షవులైన వారికి కావలసినది జ్ఞానము మరియు జ్ఞానియొక్క ఆజ్ఞలు మాత్రమే. మోక్ష కాంక్షలేనివారికి, ప్రాపంచిక సంతోషాలను కోరుకునేవారికి కర్తవ్యం అవసరము.
ఈ మోక్ష మార్గంలో ఏ విధమైన తపస్సు లేక త్యాగము యొక్క ఆవశ్యకత లేదు. జ్ఞానిని కలవటం ఒక్కటి మాత్రమే అవసరము. అపుడు జ్ఞానినుంచి పొందిన ఆజ్ఞలే నీధర్మము మరియు తపస్సు అవుతుంది. జ్ఞానము (యదార్ధ జ్ఞానము),