________________
నేను ఎవరిని ?
66
సంబంధించిన
జ్ఞానం విషయానికొస్తే అది నీ ప్రయత్నంపై ఆధారపడి ఫలితాన్నిస్తుంది. ప్రశ్నకర్త : అవును. లోపలినుంచి ఏదో అప్రమత్తం చేస్తున్నట్లు నేను అనుభూతి చెందుతున్నాను. దాదా శ్రీ : మనం ఇపుడీ మార్గాన్ని కనుగొన్నాం మరియు శుద్ధాత్మ రాజ్యంలో
మొదటి ద్వారాన్ని దాటాము. ఇక్కడి నుంచి మనల్ని ఎవ్వరూ వెనక్కి తిప్పి పంపలేరు. లోపలినుంచి నిన్ను హెచ్చరించేదెవరు? అది ప్రజ్ఞ. ప్రజ్ఞ ఆత్మ యొక్క ప్రత్యక్ష
ప్రకాశం. ఈ ప్రజ్ఞ జ్ఞానవిధి తర్వాత మొదలౌతుంది. సమకిత్ స్థితిలో ప్రజ్ఞ పాక్షికంగా వుంటుంది. ఇది అమావాస్య తర్వాతి రోజు కన్పించే నెలవంక చంద్రుని పోలి వుంటుంది. ఇది ప్రారంభదశ. ఇక్కడ జ్ఞానం పొందిన వీరందరికీ ప్రజ్ఞ పూర్ణచంద్రునిలా పూర్తిగా అభివ్యక్తమైంది. ప్రజ్ఞ యొక్క పూర్ణశక్తి నిన్ను శాశ్వతంగా అప్రమత్తంగా ఉంచుతుంది. నిన్ను అంతిమ మోక్షానికి చేర్చటమే దాని విధి. భరత్ రాజు తనను హెచ్చరించటానికి, అప్రమత్తం చేయటానికి సేవకులను నియమించుకోవలసి వచ్చింది. వారు ప్రతి పది హేను నిమిషాలకు “భరత్ రాజా! మేలుకో!” అని అరవటం ద్వారా అతనిని అప్రమత్తం చేసేవారు. నీ విషయంలో లోపలి నుంచే ప్రజ్ఞ, నిన్ను సదా హెచ్చరిస్తుంటుంది. ఇదే ఆత్మానుభూతి. నిరంతర ఆత్మానుభూతి.
అనుభవ దశలు. ప్రశ్నకర్త : ఆత్మ యొక్క అనుభూతిని ఇంకా ఎక్కువ పొందటం కోసం ఏమైనా చేయవలసివున్నదా? దాదాశ్రీ : శుద్ధాత్మ జాగృతి నీకు రోజంతా ఉంటున్నదా? ప్రశ్నకర్త : అవును. దాదాశ్రీ : మరి ఇంకా ఏ అనుభవం కావాలి? ఆ జాగృతియే శుద్ధాత్మయొక్క అనుభూతి. భారతదేశంలోని ప్రజానీకంలో ఏ ఒక్కరైనా శుద్ధాత్మజాగృతిని కల్గి ఉన్నారేమో అడిగి తెల్సుకోండి. ఈ
జ్ఞానానంతరం శుద్ధాత్మానుభూతి కలుగుతుంది. మరియు దినదినాభివృద్ధి చెందుతుంది.