________________
67
నేను ఎవరిని ?
ప్రపంచాన్ని ఆత్మరూపంగా దర్శించగలగటమే ఆత్మానుభూతి. నిన్ను నీవు శుద్దాత్మగా అనుభూతి చెందావు. ఆ నిజ దర్శనం పూర్తయింది. ఇకమీదట ఈ అనుభూతి క్రమంగా నీవు కేవలజ్ఞాన్ దశను (పూర్ణస్థితి) చేరే వరకు వృద్ధి చెందుతుంది. కేవళ్ జ్ఞానస్థితియే పూర్ణస్థితి, పూర్ణానుభూతి. ప్రస్తుతం నీ అనుభవం పాక్షికం మాత్రమే.
అనుభవం నిలిచి వుంటుంది. మీరు ఈ జ్ఞానాన్ని పొందిన క్షణం నుంచీ అనుభవం మిమ్మల్ని వదిలిపోదు. ఇది ఎలా జరుగుతుంది? మీకు నేను ఏ
జ్ఞానానుభూతినైతే ప్రసాదించానో, అది ఎప్పటికీ మిగిలి ఉంటుంది. ఏమైనప్పటికీ మీ గతకర్మ ప్రభావము ఆ అనుభావాన్ని మేఘంలా ఆవరిస్తుంది. దానిని నేను మార్చలేను. ఆ ప్రభావాన్ని సహించవలసినదే.
ప్రశ్నకర్త : దాదాజీ! ఇక మీదట మేము దానిని బాధగా తలంచము కదూ! దాదా శ్రీ : అది వేరే విషయం. కాని మిగిలియున్న ఖాతాలున్నాయి కదా! కొంతమందికి ఎక్కువ ఖాతాలు, మరికొంతమందికి తక్కువ ఖాతాలు. కొంతమంది ఎక్కువ బాధలు అనుభవించవలసి వుండవచ్చు. అదేమంత పెద్ద విషయం కాదు. నేను నిన్ను శుద్ధాత్మ స్థితికి లేవనెత్తాను. మీ పూర్వపు కర్మలఫలంవల్ల మీరు తేలికపాటి బాధలను అనుభవించవలసి వస్తే రావచ్చు.
కానీ అవి మీకు ఊపిరి సలపనంతటి తీవ్రబాధ కల్గించవు.
ఆత్మానుభూతి - దేహానుభూతి మానసిక, శారీరక సమస్యలు లేదా బాహ్య సమస్యలు మిమ్మల్ని బాధించని సమయంలో మీ జ్ఞానం నిజమైనదని మీకు తెలుస్తుంది. ఎక్కువ ధనం గల డబ్బు సంచిని నీవు పోగొట్టుకొన్నచో మానసికమైన అశాంతిని అనుభవిస్తావు. ఆ సమయంలో నీకు నీవు “ఇది వ్యవస్థితా" అని లోలోన చెప్పుకొన్నట్లయితే నీవు 'చందులాల్'ని (ఫైల్ నెంబర్ వన్ ని) సమాధానపరచగలవు. ఈ ఆంతరంగిక అనుభూతియే ఆత్మానుభూతి. అట్లు చేయనిచో “చందూలాల్ ” ప్రశాంతంగా ఉండలేక మనశ్శాంతిని కోల్పోతాడు. అపుడు అది దేహానుభూతి (దేహాధ్యాస). ఈ రెండూ నీకు అనుభవమేనా?
ప్రశ్నకర్త : అవునుదాదా! ఆత్మానందం లభిస్తుంది. అదే నా అనుభూతి.