________________
64
నేను ఎవరిని ? బహిర్ముఖమైన దేహమనోవ్యాపారాలు ప్రతీతి, అనుభవము, జాగృతి అనే మూడు స్థితుల ద్వారా ఇపుడు తిరిగి ఆత్మని చేరతాయి. లక్ష్య రహితమైన అన్ని తిరుగుళ్లనూ ముగిస్తూ అవి తమ దిశను మార్చుకొంటాయి.
ప్రశ్నకర్త : ఏ విధమైన వ్యాపారాలు (వృత్తులు)? దాదాశ్రీ : అన్ని రకాలు. ఇవి చిత్తసంబంధమైన వృత్తులు, వస్తు సంచయ సంబంధమైన వృత్తులు, ఇంద్రియ విషయములకు సంబంధించిన కోరికలు. ఇంకా చాలా రకాల వృత్తులున్నాయి. ప్రపంచంలో తిరగటానికి అలవాటు పడిన ఈ వృత్తులు ఇపుడు తిరిగి ఆత్మను చేరతాయి. బయట సంచరించటం ఆగిపోతుంది.
ఆత్మస్థితి పూర్తిగా పరిశుద్ధమైనది. ఈ జ్ఞానానంతరం, ఇంతకు పూర్వం నీలో నెలకొన్న 'నేను కర్తను' అనే భ్రాంతి తొలగిపోతుంది. నీవు పూర్తిగా శుద్ధుడవు. శుద్ధ జాగృత దశను మరువకుండుటకై ఇది 'శుద్ధాత్మ' స్థితి అని చెప్పబడింది. ఇది శుద్ధ జాగృతిని సూచిస్తుంది. నీ నిజస్వరూప శుద్ధతను ఎరుకలో ఉంచుతుంది.
ఒకవేళ 'చందులాల్' ఎవరి పైనైనా కోపగించినా, ఎవరినైనా నిందించినా, ఏమి జరిగినప్పటికీ 'నీవు' సంపూర్ణముగా శుద్ధుడవు. అయినప్పటికీ ఇటువంటి వ్యతిరేక సందర్భాలలో నీవు 'చందులాల్'కి ప్రతిక్రమణ చేయమని చెప్పాలి మరియు ఇటువంటి అతిక్రమణ ద్వారా ఇతరులకు దు:ఖాన్ని కల్గించకుండునట్లు 'చందులాల్'ని అప్రమత్తం చేయాలి.
ఇతరులు గాయపడేలా ప్రవర్తించటంగాని, మాట్లాడటం గానీ నీవు చేసినచో అది ఉద్రేకపూరితమైన చర్య. అది అతిక్రమణ కనుక దానికి ప్రతిక్రమణ చేయాలి. ప్రతిక్రమణ అనగా తన తప్పును ఒప్పుకొని ఎదుటి వ్యక్తి వద్ద పశ్చాత్తాపపూర్వకంగా క్షమను అర్ధించటం. “నేను ఈ తప్పు చేశాను. నేను తప్పు చేసినట్లు ఒప్పుకొంటున్నాను.
ఈ తప్పు మరల చేయకూడదని నిశ్చయించుకుంటున్నాను” ఈ విధంగా ప్రతిజ్ఞ చేయాలి. ఒకవేళ ఇదే తప్పు నువ్వు తిరిగి చేసినట్లయితే మళ్లీ నీవు పశ్చాత్తాపం చెందాలి,