________________
నేను ఎవరిని ?
62
అపూర్వమైన జాగ్రదానుభూతి
శ్రీమద్ రాజచంద్రగారు దీని గురించి ఇలా సూచించారు. “సద్గురువు యొక్క ఉపదేశం వల్ల అపూర్వమైన జాగృతి కలిగింది. ఆత్మపదం ఆత్మలో లభించింది. అజ్ఞానం శాశ్వతంగా పోయింది.”
జ్ఞానానికి పూర్వము దేహాన్ని గురించిన ఎరుక (దేహాధ్యాస) మాత్రమే వ్యక్తికి వుండేది. ఇంతకు ముందు చందూలాల్గా నటించినవాడు ఇపుడు శుద్ధాత్మ స్థితికి తిరిగి వచ్చాడు. ఏది నిజనివాసస్థలమో అది నిజనివాసస్థలంగా మారింది. "నేను చందూలాల్" అనే అసత్య నివాసస్థానం పోయింది.
నిర్వికల్పస్థితి
ఈ జ్ఞానానంతరం “నేను చందులాల్" అని ప్రపంచ విషయాలలో గుర్తింపుకోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. "నేను శుద్ధాత్మ' మరియు 'ఇదినాది' అనేవి రెండూ వాటి సరియైన మరియు వేర్వేరు స్థానాలలో ఉంటాయి. జ్ఞానానంతరం వికల్పము (“నేను చందులాల్") మరియు సంకల్పము (“ఇది నాది”) ఏ మాత్రమూ వుండవు. ఇది నిర్వికల్పస్థితి. ('నేను' రాంగ్ ప్లేస్లో ఉండటం వల్ల కలిగిన భ్రమ తొలగటమే నిర్వికల్పస్థితి.) సంకల్ప వికల్పములు తొలగిన తర్వాత మాత్రమే నిర్వికల్పస్థితి లభిస్తుంది. మొదట్లో నిర్వికల్ప సమాధియొక్క ఒక రుచి నీకు అనుభూతమై, కాలక్రమేణ పెరుగుతుంది. కాని ప్రారంభంలో జ్ఞానం నీకు స్థిరంగా వుండదు. కారణమేమంటే అనేక జన్మలుగా నీవు ఈ సహజ స్థితిని అనుభవించలేదు.
ఆత్మానుభూతిని పొందటం తేలికకాదు. ఒకరు "నేను శుద్ధాత్మ, నేను శుద్ధాత్మ ..” అని మరల మరల చెప్తుండవచ్చు కాని అనుభవం మాత్రం కల్గదు. శుద్ధాత్మయొక్క అనుభూతిని పొందుటకు జ్ఞానము మరియు జ్ఞానియొక్క అనుగ్రహము అవసరము. ఇవి కాక వేరే ఏ మార్గమూ లేదు. జ్ఞానప్రాప్తి ప్రతీతికి (దృఢ విశ్వాసము), లక్ష్యమునకు (జాగృతి) మరియు అనుభవమునకు దారి తీస్తుంది. పైగా ప్రతీతి ఎన్నడూ వదలిపోదు.