________________
60
నేను ఎవరిని ?
ప్రశ్నకర్త : పాక్షిక ఆత్మానుభవదశ అంటే ఏమిటి? దాదాశ్రీ : ఆత్మయొక్క తాత్కాలిక దశ అయిన ఈ అంతరాత్మ రెండు పాత్రలను నిర్వహిస్తుంది. ఒకటి ప్రాపంచిక వ్యవహారాలను పూర్తి చేయటం మరియు రెండవది అంతిమమోక్షాన్ని పొందటం అనగా మీ ఫైల్స్ ని సమభావంతో నిర్వహించటం మరియు శుద్ధాత్మపై ధ్యానం చేయటం. (జ్ఞానప్రాప్తి తర్వాత ఒక వ్యక్తి నిర్వర్తించవలసిన ఏ పనికి గాని, అతనితో లావాదేవీలు లేక అనుబంధాలున్న ఏవ్యక్తికి గాని దాదాశ్రీ 'ఫైల్' అనే పదాన్ని వాడేవారు.) ఫైల్స్ నిర్వహణ ఒకసారి పూర్తయితే పరమాత్మ స్థితి ప్రాప్తిస్తుంది. అంతరాత్మ యొక్క కర్తవ్యం ఏమంటే ఫైల్ నెంబర్ వన్ ని (చందులాల్ గా వ్యవహరించబడే దేహం) మరియు ఇతర ఫైల్సను నిర్వహించటం. నువ్వు శుద్ధాత్మ మరియు చందులాల్ ఫైల్ నెంబర్ వన్ ; చందులాల్ (ఫైల్ వన్) తన ప్రాపంచిక బాధ్యతలన్నింటినీ (ఖాతాలన్నింటినీ) సమభావంతో పూర్తి చేయాలి.
ప్రశ్నకర్త : ఇది జ్ఞానాన్ని పొందిన వారికి మాత్రమే వర్తిస్తుందా? దాదా శ్రీ : అవును.
జ్ఞానాన్ని పొందిన వారు మాత్రమే అంతరాత్మను పొందుతారు. అంతరాత్మయే తాత్కాలిక ప్రభుత్వము. ఒకసారి సమభావంతో అన్ని ఫైల్స్ నిర్వహణ పూర్తి అయితే, శాశ్వత ప్రభుత్వ స్థాపన జరుగుతుంది. శాశ్వత ప్రభుత్వం అంటే పూర్ణ పరమాత్మ. జ్ఞానానంతరం మాత్రమే మీరు దీనిని చెప్పగలరు
ప్రశ్నకర్త : 'నేను శుద్ధాత్మ” అని మేము చెప్పినచో అది అహంకార వ్యక్తీకరణకాదా? దాదాశ్రీ : కాదు. ఇతరులు అలా చెప్పినట్లయితే అది అహంకార వ్యక్తీకరణే అవుతుంది. శుద్ధాత్మ అనే నిశ్చయానుభూతి మీకు కల్గింది కనుక మీరు ఏది అయి వున్నారో దాని గురించి మీరు మాట్లాడటం అహంకారం కాదు.
చాలామంది "నేను శుద్ధాత్మ” అని చెప్పగలరు. అది ఎలా వుంటుందంటే ఒక వ్యక్తి తన నిద్రలో నీకు ఐదువందల డాలర్లు ఇస్తానని చెప్పినట్లు (కలవరింత) ఉంటుంది. అతనిని నీవు నమ్ముతావా? అతడు జాగ్రదవస్థలో ఉండగా చెప్తే అది వేరే విషయం .