________________
నేను ఎవరిని ?
జాగృతి లేకుండా ఏమి చెప్పినప్పటికీ అది అర్ధరహితమే. అదే విధంగా ప్రజలు ఆత్మానుభూతి పొందకుండా “నేను శుద్ధాత్మ" అని చెప్పినచో అది నిద్రలో మాట్లాడిన మాటలవంటిది. ఈ విధంగా మాట్లాడటం ద్వారా వారేమీ పొందలేరు. నిజానికి యిటువంటి మాటలు వారు తమ జీవితంలో తప్పులు చేయటానికి కారణమౌతాయి. ఆత్మానుభూతి పొందిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తికి “నేను శుద్ధాత్మ” అని చెప్పే హక్కు వుంది.
61
ప్రశ్నకర్త : జాగృతిని పొంది వుండాలా?
దాదాశ్రీ : అవును, ఆత్మానుభూతి తర్వాత మాత్రమే “నేను శుద్ధాత్మ” అని నీవు చెప్పగలవు. అపుడే అది సరైనది, ఎందువల్లనంటే నిన్ను నీవు నిజముగా తెలుసుకొన్న తర్వాత, నీవు శుద్ధాత్మగా మారిన తర్వాత నీవు ఆవిషయం చెప్తున్నావు. నువ్వు శుద్ధాత్మగా మారిన దానికి ఋజువు ఏమిటని నీవు అడిగినచో, అపుడు నేను నిన్ను “నీవెవరవు?” అని అడుగుతాను. “శుద్ధాత్మ” అని నీవు సమాధానం చెప్తావు. ఆ తర్వాత నేను నిన్ను “నీకు చందులాల్పై మోహం పోయిందా?” అని అడుగుతాను. నువ్వు నీకు మోహం తొలగిందని చెప్తావు. ఇదే నువ్వు శుద్ధాత్మగా మారినట్లు దృఢపరుస్తుంది.
జ్ఞాని మీ ఎరుకను మేల్కొలుపుతాడు.
ఈ జ్ఞానానంతరం నీనిజ ఆత్మయే నీగృహమని, దానికి బాహ్యమైనదంతా పరాయిది అని నువ్వు గుర్తిస్తావు. దాని అర్ధం నీ పని పూర్తి అయినట్లే. ఇది, నిద్రపోతున్న వ్యక్తి తనను ఎవరో మేల్కొల్పగా అపాయముల నెదుర్కొనుటకు సిద్ధముగా మేల్కొని
యుండుట వంటిది. అతను తన నిజనామానికి బదులు పలుకుతాడు.
ఒకసారి నీ నిజమైన గుర్తింపు శుద్ధాత్మగా తెలియబడిన తర్వాత నువ్వు మేలుకొని ఉంటావు. కాని ఎంతకాలం వరకు “నేను చందులాల్" అనే నమ్మకం నీకు ఉంటుందో, అంతకాలం నువ్వు నిద్రపోయినవాడిగానే పరిగణింపబడతావు. ఒక జ్ఞాని మాత్రమే ఈ భ్రమను నాశనం చేసి, నువ్వు శుద్ధాత్మవనే సరియైన నమ్మకానికి నిన్ను మేల్కొలపగలడు. ఒకసారి ఈజ్ఞానం నీలో స్థిరపడిన తర్వాత నీవు చందులాల్ నుంచి శాశ్వతంగా వేరుగా వుంటావు.