Book Title: Who Am I
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 72
________________ 63 నేను ఎవరిని ? అనుభవము, జాగృతి మరియు ప్రతీతి ప్రశ్నకర్త : ప్రతీతి అనగా నేమి? దాదాశ్రీ : 'నేను ఆత్మను' అని ఒకరిలో బాగా లోతుగా పాతుకొనిపోయిన దృఢమైన నమ్మకము. ప్రారంభంలో ఈ దృఢ విశ్వాసం మాటల మాద్యమం ద్వారా పట్టుబడుతుంది. క్రమంగా 'నేను ఆత్మ' అని అనుభూతి కల్గుతుంది. “నేను చందులాల్" అనే నీ పూర్వపు దృఢ విశ్వాసం ఇపుడు చెదరగొట్టబడి శుద్ధాత్మ జాగృతితోపాటు నీవు శుద్ధాత్మవనే పూర్ణ దృఢనిశ్చయం నెలకొల్పబడింది. ఒకసారి నీవు శుద్ధాత్మవైనచో నీకు మోక్షానికి గ్యారంటీ లభించినట్లే. ఈ విషయంలో ఏ సందేహానికీ తావులేదు. శుద్ధాత్మస్థితిని నీవు ఎంతగా అనుభవిస్తున్నావు? ప్రాధమిక దశలో ఇది ప్రతీతి నుండి కల్గుతుంది. నీవు రాత్రివేళ మేల్కాంచితే వెంటనే నీకు నువ్వు శుద్ధాత్మవనే జాగృతి కలుగుతుంది. నీకు 100% శుద్ధాత్మ దృఢ నిశ్చయం వున్నదని, జాగృతి కూడ స్థాపించబడిందని దీని అర్ధం. జాగృతి (లక్ష్యం) అనగా ఆధ్యాత్మికంగా మేల్కొని యుండుట. పూర్ణస్థితిని చేరేవరకు ఈ జాగృతి వృద్ధిపొందుతూ ఉంటుంది. నీవు అనుభూతి చెందటం మూడవది. శుద్ధాత్మానుభూతి కారణంగానే నీవు ప్రతిరోజూ సత్సంగానికి హాజరవుతున్నావు (సత్=పూర్ణసత్యం, సంగం=కలయిక); నీవు ఏదోరుచి చూశావు మరియు దానిలోని మాధుర్యాన్ని కనుగొన్నావు. ఇక మీదట నీ నిజ స్వరూపం (ఆత్మ) యొక్క అనుభూతి, జాగృతి మరియు దృఢవిశ్వాసం నీకు కలుగుతుంది. దానికై పట్టే సమయంలో మనిషి మనిషికి కొంత వ్యత్యాసం వుండవచ్చు. అనుభవం మరియు జాగృతి వీటిలో హెచ్చుతగ్గులుంటాయి. శుద్ధాత్మస్థితి యొక్క దృఢ నిశ్చయం (ప్రతీతి) మాత్రం స్థిరంగా వుంటుంది. ప్రతీతి స్థిరంగా వుంటే ఆ స్థితిని 'క్షాయక్ సమకిత్' (Continuous link of the right belief) అని పిలుస్తారు. ప్రతీతిలో హెచ్చు తగ్గులుంటే దానిని 'సమ్యక్ దర్శన్ లేక ఉపశమ సమకిత్' అంటారు. ఒక వ్యక్తి చేసేపని మీద ఆధారపడి, జాగృతి మార్పుకు లోనవుతుంది. ఎవరితోనైనా మాట్లాడుతున్నట్లయితే అపుడావ్యక్తికి జాగృతి వుండదు. ఇక అనుభవం విషయానికొస్తే ఒంటరిగా ఉన్నపుడు ఇది కలుగుతుంది. అనంతజన్మలుగా

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90