________________
58
నేను ఎవరిని ?
శాశ్వత ఆత్మానుభూతి దాదా శ్రీ : 'నేను శుద్ధాత్మ' అనే ఎరుకలో నీవెంత సేపు వుంటున్నావు?
ప్రశ్నకర్త : నేను ఒంటరిగా, ప్రశాంతంగా, ఏకాంత ప్రదేశంలో కూర్చున్నపుడు. దాదా శ్రీ : వేరే సమయాలలో నీ అనుభూతి ఏమిటి ? ఏ సమయంలో నైనా 'నేను చందులాల్' అనే భావన కలుగుతుందా? నీకు నిజంగా ఎపుడైనా “నేను చందులాల్”ని అనే తలంపు కలుగుతుందా?
ప్రశ్నకర్త : జ్ఞానం తీసికొన్న తర్వాత అది జరగలేదు. దాదాశ్రీ : అయితే నీవు కేవలం శుద్ధాత్మవి. ఒకరు ఒకే అభిప్రాయాన్ని కల్గి ఉండగలరు. దైనందిన జీవితంలో కొంతమంది తమ పేర్లను కూడ మర్చిపోతుంటారు. దానివల్ల ఏ సమస్యా లేదు. నీ శుద్ధాత్మదశ ఖచ్చితంగా నిల్చి వుంటుంది.
ప్రశ్నకర్త : కాని దైనందిన జీవితంలో చాలాసార్లు శుద్ధాత్మ ఎరుక ఉండటం లేదు.
దాదాశ్రీ : అపుడు దాని స్థానంలో 'నేను చందుభాయ్ ని' అనే ఎరుక చోటు చేసికొంటున్నదా? మూడు గంటలపాటు నీకు నువ్వు శుద్ధాత్మ అనే జాగృతి లేకపోతే, అపుడొక వేళ నేను నిన్ను “నువ్వు చందూభాయ్ వా? శుద్ధాత్మవా?” అని అడిగితే నీవేమి చెప్తావు?
ప్రశ్నకర్త : శుద్ధాత్మ. దాదాశ్రీ : అలా అయితే శుద్ధాత్మ జాగృతి ఎల్లవేళలా ఉన్నదనే అర్ధం. ఒక మనిషి మద్యం త్రాగి ఆ సమయంలో తన ఎరుకను కోల్పోయాడనుకో. ఆమద్యం మత్తు దిగిపోయాక ఏమి జరుగుతుంది?
ప్రశ్నకర్త : అతడు మరల తనను తాను గుర్తిస్తాడు. దాదా శ్రీ : బాహ్య పరిస్థితులు నిన్ను కూడ ఈ విధంగానే ప్రభావితం చేస్తాయి.