________________
57
నేను ఎవరిని?
(12) ఆత్మానుభూతి పొందిన తరువాత
ఆత్మానుభవ చిహ్నాలు ఈ జ్ఞానాన్ని పొందుటకు ముందు నువ్వు చందులాల్ గా ఉండే వాడివి,
జ్ఞానం తర్వాత నువ్వు శుద్ధాత్మగా మారావు. ఏదైనా భేదం నీకు అనుభవమయ్యిందా?
ప్రశ్నకర్త : అవును.
దాదా? : ఈ అనుభూతి నీకు ఉదయం నిద్రలేచిన క్షణం నుంచీ కలుగుతుందా? లేక మధ్యాహ్నమా?
ప్రశ్నకర్త : ఇంతకు పూర్వపు ఏ అనుభూతి కంటే కూడ ఇది భిన్నమైనది. నేను నిద్రలేచేసరికే అది తనంతట తానుగా హాజరవుతుంది.
దాదాశ్రీ : అర్ధరాత్రి నీవు నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు నీకు మొదట గుర్తు వచ్చేది ఏది?
ప్రశ్నకర్త : శుద్ధాత్మ. దాదాశ్రీ : అవును. అర్ధరాత్రిలో మేల్కొన్నప్పుడు శుద్ధాత్మ అప్రయత్నంగా నీకు గుర్తు వచ్చినచో, అది నీవు ఆత్మను గుర్తించిన దానికి ఋజువు. ఇక నీవు జ్ఞాని పురుషుని ఆజ్ఞలను పాటించవలసి వున్నది. ఈ ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి.
నేను మీకు ఈ జ్ఞానం యిచ్చిన తర్వాత, మీలోని ఆత్మ జాగృతమౌతుంది. అపుడు నీవు పురుషుడవు (ఆత్మానుభూతి పొందినవాడివి) అవుతావు. నిన్ను శుద్ధాత్మగా గుర్తిస్తావు. నీపాపాలను నేను భస్మీభూతం చేస్తాను. నేను నీకు దివ్యదృష్టిని (దివ్యచక్షువుని) ప్రసాదిస్తాను, తత్ఫలితంగా నీవు అందరిలోనూ శుద్ధాత్మను చూడగలవు. నీకు రైట్ బిలీఫ్ ను యిచ్చి నీ ఆత్మతో నిన్ను ఏకం చేసిన తర్వాత నేను నీకు ఐదు ఆజ్ఞలు (ప్రధాన నియమములు) యిస్తాను. ఈ ఆజ్ఞలు నీకు మార్గదర్శనం చేసి, రక్షిస్తాయి.