________________
55
నేను ఎవరిని ?
నేను స్వయంగా నా ఆధ్యాత్మిక శక్తులను (సిద్ధులను) కొంత మందికి యివ్వనున్నాను. నా తర్వాత ఎవరో ఒకరి అవసరం మనకి లేదా? భావితరాలవారికి ఈ మార్గం యొక్క ఆవశ్యకత లేదా?
ప్రపంచము ఎవరిని అంగీకరిస్తే వారే ఉత్తరాధికారి ప్రశ్నకర్త : మీరు వెళ్లిపోయినప్పుడు మీ కొరకు దు:ఖించేవారు వేల సంఖ్యలో ఉంటారని, కానీ శిష్యులు ఎవరూ ఉండరని మీరు చెప్తున్నారు. దీని అర్ధం ఏమిటి?
దాదాశ్రీ : నాకు శిష్యులు ఎవరూ ఉండరు. ఇక్కడ ఆధ్యాత్మిక సింహాసనం ఏమీ లేదు. ఇది సింహాసనం అయినట్లయితే వారసుల అవసరం ఉంటుంది. పుత్రపౌత్రాదులు వారసత్వానికి ప్రయత్నించవచ్చు. కాని యిక్కడ, ఎవరు ప్రపంచంచేత అంగీకరించబడతారో వారు మాత్రమే ఈ పనిని కొనసాగిస్తారు. సంపూర్ణ వినయముగలవారిని మాత్రమే ప్రపంచము అంగీకరిస్తుంది. ఎవరు ప్రపంచం యొక్క శిష్యునిగా వుంటారో వారే జయిస్తారు.
ప్రత్యక్ష జ్ఞానుల వంశావళి ప్రశ్నకర్త : ఇక్కడ మీవద్దకు వచ్చినవారంతా క్రమమార్గం నుంచి అక్రమమార్గానికి వచ్చినవారే. వీరిలో ప్రతి ఒక్కరు ఈ జ్ఞానాన్ని తమ స్వీయ రీతిలో అనుభూతి చెందారు.
ఈ అక్రమ మార్గం యొక్క నిరుపమాన విశిష్ఠత ఏమంటే మేము ప్రత్యక్షజ్ఞాని పురుషుని కలుసుకొన్నాము. కొంతకాలం తర్వాత జ్ఞాని పురుషుడు లభించటం దుర్లభము నిజమేనా? దాదాశ్రీ : అవును, నీవు చెప్పింది నిజమే.
ప్రశ్నకర్త : మీ ప్రత్యక్ష సాన్నిధ్యంలో అక్రమ మార్గాన్ని పొందినవారి సంగతి అటుంచితే, మీరు వెళ్లిపోయిన తర్వాత ఈ మార్గానికి వచ్చేవారి విషయం ఏమిటి? వారికి ఈ అవకాశం ఉండదు కదా!
దాదాశ్రీ : ఉంటుంది, తప్పక ఉంటుంది.