________________
నేను ఎవరిని ?
54
కష్టములు తొలగించబడతాయి. ఐహిక విషయాలలో మీకు అత్యాశ పనికిరాదు, ఎందువల్లనంటే ఆశకు అంతం లేదు. దాదా భగవాన్ అంటే ఏమిటో మీకు అర్ధమైందా?
నీవు నీ కళ్ళతో చూస్తున్న వ్యక్తి దాదా భగవాన్ కాదు. నీ ఎదుట ఉన్న వ్యక్తి దాదా భగవాన్ అని నీవు తలుస్తూండవచ్చు. కానీ కాదు. నీవు చూస్తున్నది బాదరణ్ (భారతదేశం లోని ఒక గ్రామం) వాసి అయిన ఒక పటేల్ ని. నేను ఒక జ్ఞానిపురుషుడను. దాదాభగవాన్ నాలో విరాజమానుడై యున్నాడు. మరియు సంపూర్ణంగా అభివ్యక్తమైనాడు. చతుర్దశ భువనాలకు ప్రభువు నాలో సాక్షాత్కరించినాడు. నేను అతడిని స్వయంగా దర్శించి అనుభూతి చెందాను. అందువలననే అతడు నాలో అభివ్యక్తమైనాడని పూర్తి నిశ్చయముతో చెప్తాను.
ఈ మాటలు చెప్పేదెవరు? మాట్లాడుతున్నది ఒక టేప్ రికార్డర్. దాదా భగవాన్ కి వాక్కు లేదు. టేప్ రికార్డర్ ఆధారంగా మాట్లాడుతున్నది ఈ పటేల్. పటేల్ మరియు దాదాభగవాన్ విభజన జరిగిన తర్వాత “మాట్లాడే వాడిని నేను” అని చెప్పటానికి అహంకారం ఏమాత్రం మిగిలిలేదు. ఈ టేప్ రికార్డర్ మాట్లాడుతుంది; నేను దానికి జ్ఞాత, ద్రష్టగా ఉంటాను. మీలో కూడ మాట్లాడేది టేప్ రికార్డరే ; కానీ నువ్వు “నేను మాట్లాడుతున్నాను” అని తలుస్తావు, దానితో నీలో కృత్రిమ అహంకారం తలెత్తుతుంది. నా వరకు నేను కూడ నాలోని పరమాత్మ, దాదా భగవాన్ కి శిరసా ప్రణమిల్లవలసి ఉన్నది. దాదా భగవాన్ మరియు నేను వేరు వేరు. మేము ఒకరితో ఒకరం స్నేహ సంబంధం కల్గి యుంటాము. నా ఈ శరీరమే దాదా భగవాన్ అని ప్రజలు తలుస్తారు. కానీ కాదు. బాదరణ్ వాసి అయిన ఈ పటేల్ దాదా భగవాన్ ఎలా కాగలడు?
(11) అక్రమ మార్గము కొనసాగుతుంది
జ్ఞానుల వంశావళి కొనసాగుతుంది నేను నా వెనుక ఒక తరము జ్ఞానులను వదలివెళతాను. నేను నా ఉత్తరాధికారిని వదలి వెళతాను. ఆ తర్వాత జ్ఞానుల లింక్ కొనసాగుతుంది. అందువల్ల మీరు సమకాలీన జ్ఞానికై వెదకండి.
జ్ఞానిలేనిచో పరిష్కారం సాధ్యంకాదు.