________________
52
నేను ఎవరిని ?
(10) దాదా భగవాన్ ఎవరు? 'నేను' మరియు 'దాదా భగవాన్', ఒకరు కాదు ప్రశ్నకర్త : మిమ్ములను భగవాన్ (దైవం) గా సంబోధించటాన్ని మీరు ఎందుకు అనుమతిస్తున్నారు?
దాదా శ్రీ : నేను భగవంతుణ్ణి కాను. నాలో ఉన్న దాదా భగవాన్ కి నేను కూడ నమస్కరిస్తాను. నా ఆధ్యాత్మిక
జ్ఞానము 356'వద్ద ఉన్నది ; దాదా భగవాన్ 360° వద్ద ఉన్నారు. నేను నాలుగు డిగ్రీలు తక్కువలో ఉన్నందున నేను కూడ నాలో ఉన్న దాదా భగవాన్ కి శిరస్సు వంచి ప్రణమిల్లుతాను.
ప్రశ్నకర్త : మీ రెందుకు ఈ పని చేయాలి? దాదాశ్రీ : నేను మిగిలిన నాలుగు డిగ్రీలు పూర్తి చేయగోరుతున్నాను కనుక నేను అలా చేస్తాను. నేను ఆ నాలుగు డిగ్రీలు పూర్తి చేయవలసి వున్నది. నాలుగు డిగ్రీలు తక్కువైనందున నేను ఫెయిల్ అయ్యాను. తర్వాతసారి పాస్ కావటం తప్ప నాకు ముక్తికి మార్గం లేదు.
ప్రశ్నకర్త : మీకు భగవంతుడిగా ఉండాలన్న కోరిక ఉందా? దాదాశ్రీ : భగవాన్ గా ఉండటం నాకు భారంగా ఉంటుంది. నేను లఘూత్తమ (ఎవరైతే ప్రపంచంలోని ప్రతిదీ నిజంగా తనకంటే చాలా ఉన్నతమైనది అని తలుస్తారో వారు - అహంకార రహిత స్థితి) పురుషుణ్ణి. నాకంటె అల్పమైన ప్రాణి వేరే ఏదీ లేదు, అందువల్ల భగవంతుణ్ణి కావటం నాకు భారంగా వుంటుంది.
ప్రశ్నకర్త : భగవంతునిగా ఉండాలని కోరుకోనప్పుడు, నాలుగు డిగ్రీలు పూర్తి చేయాలని ఎందుకు ప్రయత్నించాలి?
దాదా శ్రీ : అది నా అంతిమ ముక్తి కోసం. 'భగవాన్' అనే శబ్దం గుణ విశేషణము. ఆగుణధారణ కారణంగా యోగ్యుడైన ఏ వ్యక్తినైనా ప్రజలు భగవాన్ అని పిలుస్తారు. ప్రపంచాన్ని చూసాను కాని దానిని పూర్తిగా ఎరుగను పూర్ణజ్ఞానస్థితి (కేవల జ్ఞానస్థితి) పొందటానికి నాలుగు డిగ్రీలు మాత్రమే తక్కువలో ఉంటాడు జ్ఞాని పురుషుడు. నేను స్వస్వరూపానుభూతి దశను దాటి వెళ్లాను,
కానీ