________________
నేను ఎవరిని ?
దాదా శ్రీ : అవును, సంత్పురుషుడు నిన్ను పాపకర్మలనుంచి రక్షిస్తాడు, కాని జ్ఞాని పురుషుడు పుణ్యపాపాలనే రెండు కర్మలనుంచి నిన్ను రక్షిస్తాడు. సంత్పురుషుడు నిన్ను సన్మార్గంలో నడిపిస్తాడు. కాని జ్ఞానిపురుషుడో నిన్ను ముక్తుణ్ణి చేస్తాడు. ఒక ప్రత్యేక మార్గంలో ప్రయాణించేవారు సంత్పురుషులు. వారు స్వయంగా ఒక మార్గంలో నడుస్తూ ఇతరులను కూడ తమతోపాటు నడవవలసినదిగా ప్రోత్సహిస్తారు. కానీ జ్ఞానిపురుషుడే అంతిమ గమ్యస్థానము. అతడు మాత్రమే నీపని పూర్తిచేయగలడు.
50
సంత్ పురుషులు వివిధ స్థాయిలలోని బోధకులు, ఉదాహరణకి కిండర్ గార్డెన్ వారికి, ఫస్ట్ స్టాండర్డ్ వారికి, సెకండ్ స్టాండర్డ్ వారికి వగైరా. కాని జ్ఞానిపురుషుడు మాత్రమే నీకు పూర్తి ముక్తిని ప్రసాదించగలడు. జ్ఞాని పురుషుడు చాలా అరుదుగా లభిస్తాడు.
సంత్పురుషులు అనాత్మస్థాయిలో ఆనందాన్నివ్వగలరు. జ్ఞానిపురుషుడు ఆత్మయొక్క స్వభావ సహజమైన శాశ్వతానందాన్ని మీకు ప్రసాదించగలడు. అతడు మీకు శాశ్వత శాంతిని అనుగ్రహిస్తాడు.
ఏ విషయంపైన, దేనిమీద ఏమాత్రం మమకారము లేనివాడే నిజమైన సంత్పురుషుడు. విభిన్న స్థాయిలలో మమకారాన్ని కలిగి ఉన్నవారు కూడ కొందరున్నారు. జ్ఞాని పురుషుడెవరు? ఎవరికి అహంకార మమకారములు లేవో అతడే జ్ఞాని.
అందువల్ల నీవు సంత్ని జ్ఞానిపురుషునిగా పేర్కొనకూడదు. సంత్ ఆత్మానుభూతిని పొందినవాడు కాదు. అయినప్పటికీ, జ్ఞాని పురుషుని కలిసినపుడు సంతక్కూడ ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతాడు. సంత్కి కూడ జ్ఞాని పురుషుని కలవవలసిన అవసరం వుంది. మోక్షేచ్ఛగలవారెవరైనా సరే జ్ఞానిపురుషుని దర్శించాలి. వేరే మార్గం లేదు.
జ్ఞాని పురుషుడు ప్రపంచం యొక్క నిజమైన ఒక ఆశ్చర్యము. ఆత్మ యొక్క అభివ్యక్తీకరణయే జ్ఞానిపురుషుడు.
జ్ఞాని పురుషుని గుర్తించుట.
ప్రశ్నకర్త : మీరు జ్ఞాని పురుషుని ఎలా గుర్తించగలరు?
దాదాశ్రీ : జ్ఞాని పురుషుడు దాగి ఉండలేడు. అతని పరిమళము, ప్రకాశము పూర్తి