________________
నేను ఎవరిని ?
ఒక భేద విజ్ఞాని ('నేను' మరియు 'నాది' వీటిని విభజించే పరిపూర్ణ శాస్త్రజ్ఞుడు) ఈ విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాడు.
49
అందువల్ల నువ్వు ఏమి కోరినా యివ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏమి కోరుకున్నా సరే. నిర్వికల్ప సమాధిని కోరుకో (జీవితంలో అన్ని బాధ్యతలూ నిర్వర్తిస్తూనే నిరంతరాయంగా నిరంతర ఆత్మానందానుభూతి). వేదన, చింతలు లేని శాశ్వతస్థితిని కోరుకో. నేను నీకు గ్యారంటీగా వీటినన్నింటినీ యిస్తాను. నీకు కావలసినది ఏదైనా అడుగు కాని ఏమి కోరుకోవాలో నీవు తెలుసుకోవాలి. ప్రపంచ వ్యవహారాల మధ్య జీవిస్తున్నప్పటికీ కూడ ఈ విజ్ఞానం నీకు స్వేచ్చని ప్రసాదిస్తుంది.
నీ పని పూర్తి చేసుకో.
నీపని పూర్తిచేసుకో. నీకు ఎపుడు దీని అవసరమైతే అప్పుడు ఇక్కడకు రా. నిన్ను రమ్మని నేను నిర్బంధించటం లేదు. నీకు రావాలని అనిపిస్తేనే రా. నీకు ప్రాపంచిక జీవనమూ, యధాతథంగా ఆవిషయాలు యిష్టమైతే నీవు యిప్పటిలాగే కొనసాగు. ఈ మార్గాన్ని అనుసరించమని నీపై ఏ ఒత్తిడీ లేదు. నిన్ను రమ్మని ఆహ్వానిస్తూ ఉత్తరాలు వ్రాయటానికి కాదు నేనిక్కడ ఉన్నది. నీవు నన్ను కలవటం జరిగితే, అపుడు నేను నీకు ఈ జ్ఞానం గురించి చెప్పి దానిలాభాన్ని పొంది పనిపూర్తిచేసుకోమని సలహా యిస్తాను. ఇంతమాత్రమే నేను మీకు చెప్తాను. కొన్నివేల సంవత్సరాలపాటు ఇటువంటి విజ్ఞానం అందుబాటులో లేదు.
(9) జ్ఞాని పురుషుడు ఎవరు? సంత్ పురుషుడు జ్ఞాని పురుషుడు
ప్రశ్నకర్త : సంత్ పురుషుడు (ఋషి, ముని) మరియు జ్ఞాని పురుషుడు వీరికి గల
భేదమేమి?
దాదాశ్రీ : చెడు కర్మలను వదలి పెట్టమని మంచి కర్మలను చేయమని ప్రజలకు ఎవరు బోధిస్తారో అట్టి పవిత్రులు సంత్పురుషులు.
ప్రశ్నకర్త : అయితే ఎవరు మమ్ములను పాపకర్మల నుంచి కాపాడతారో వారు సంత్పురుషులని చెప్పబడతారా?