________________
51
నేను ఎవరిని ? స్పష్టతను కల్గియుంటాయి. అతని పరిసరాలు ప్రసిద్ధికెక్కుతాయి. అతని వాణి అసాధారణమైన ప్రత్యేకతను కల్గి ఉంటుంది. అతని మాటల ద్వారా మీరు అతనిని గుర్తించవచ్చు. అతని కళ్లలోకి చూడటం ద్వారా కూడ మీరు అతడిని జ్ఞాని అని చెప్పగలరు. వివాదములకు తావులేని ప్రామాణిక చిహ్నములెన్నింటినో జ్ఞాని కలిగి వుంటాడు. అతని ప్రతి మాటా ఒక వేదము. అతని వాణి, వర్తన, వినయము ఎంతో మనోజ్ఞమై మిమ్ము గెలుచుకుంటాయి. అతడు చాలా విలక్షణమైన గుణములు కలిగివుంటాడు.
జ్ఞాని పురుషుని గుణ విశేషము లేమి? సూర్యునికాంతి, చంద్రుని చల్లదనము అతని ప్రకృతిలో భాగము. ఈ రెండు వ్యతిరేకగుణాలు కలిసి ఉండటం జ్ఞానిలో మాత్రమే కన్పిస్తుంది.
జ్ఞానిలో కాక ప్రపంచంలో మరెక్కడా అట్టి ముక్త మందహాసాన్ని దర్శించలేరు. అతని ప్రశాంత మందహాసము ఇతరులను తమ దు:ఖాల్ని మరిపింపజేస్తుంది.
అహంకార పూరిత బుద్ధి జ్ఞానిలో లేశమాత్రం ఉండదు. జ్ఞానిపురుషుడు అబుధ్ (బుద్ధి శూన్యమైన
స్థితి) అయి వుంటాడు. ఇటువంటి వారు మనచుట్టూ ఎంతమంది ఉంటారు? ఎప్పుడో అరుదుగా ఇటువంటి వ్యక్తి జన్మించినపుడు అతడు వేలకొద్దీ ప్రజల్ని ముక్తుల్ని చేస్తాడు.
జ్ఞాని పురుషునిలో అతిసూక్ష్మ పరిమాణంలో కూడ అహంకారం ఉండదు.
జ్ఞానిపురుషుడు కాక అహంకార రహితుడైన వ్యక్తి ఒక్కరు కూడ ఈ ప్రపంచంలో లేరు. అరుదుగా, కొన్ని వేల సంవత్సరముల కొకసారి, ఒక
జ్ఞాని పురుషుడు జన్మిస్తాడు. సంత్ లు,
శాస్త్ర పాండిత్యం గలవారు చాలామంది వున్నారు. కాని ఆత్మానుభూతిని పొందినవారు లేరు. జ్ఞానులు ఆత్మను గురించి పూర్ణజ్ఞానం కల్గి వుంటారు. ఆత్మజ్ఞాని పరమసుఖి, అతనిని ఏ విధమైన బాహ్యాంతరదు:ఖం స్పృశించలేదు. అటువంటి వ్యక్తి సాన్నిధ్యంలో మీరు కూడ ముక్తి పొందగలరు. సద్వస్తువును గుర్తించినవారే ఇతరులు కూడ దానిని గుర్తించటంలో సహాయపడగలరు. ఒక జ్ఞాని సహాయం లేకుండా ఆత్మజ్ఞానాన్ని పొందటం అసాధ్యం.