Book Title: Who Am I
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 62
________________ 53 నేను ఎవరిని ? యింకా పూర్ణముక్త స్థితిని లేదా కేవల జ్ఞానస్థితియైన పరమాత్మ దశను చేరలేదు. ప్రశ్నకర్త : ఏ నాలుగు డిగ్రీల గురించి మీరు మాట్లాడుతున్నారు? దాదాశ్రీ : ఆ నాలుగు డిగ్రీలు నా యొక్క బాహ్య మరియు ప్రాపంచిక వర్తనకు సంబంధించినవి. నేను ఈ ప్రపంచాన్ని ప్రస్తుతం అవగతం చేసుకొన్నప్పటికీ, దానిని పూర్తిగా విస్పష్టంగా తెలుసుకోలేదు. కేవళ్ జాన్ అనగా ప్రపంచాన్ని ఉన్నదానిని ఉన్నట్లుగా తెలుసుకోవటం. నేను దానిని అవగతం చేసుకొన్నాను. కాని పూర్తి స్పష్టతతో తెలుసుకోలేదు. ప్రశ్నకర్త : అవగతం చేసికోవటం మరియు తెలుసుకోవటం వీటికి గల భేదం ఏమిటి? దాదాశ్రీ : నేను పూర్తిగా అర్ధంచేసికొన్నాను కాని పూర్తిగా అనుభవపూర్వకంగా తెలిసికోలేదు. నేను దానిని పూర్తిగా తెలిసికొని ఉన్నట్లయితే దానిని “కేవళ్ జాన్"గా పేర్కొంటారు. నేను పూర్తిగా అర్ధం చేసుకొన్నాను గనుక ఇది "కేవళ్ దర్శన్”గా పేర్కొనబడుతుంది. ఇక్కడ ప్రకటితమైనది చతుర్దశభువనాలకు ప్రభువు ప్రశ్నకర్త : మీరు 'దాదా భగవాన్' అనే శబ్దాన్ని ఎవరిని ఉద్దేశించి ప్రయోగిస్తున్నారు? దాదా శ్రీ : ఆ శబ్దము దాదాభగవాన్ ని ఉద్దేశించినది, నన్ను కాదు. నేను జ్ఞానిపురుషుడను. ప్రశ్నకర్త : ఏ భగవాన్ ? దాదా శ్రీ : నాలో అభివ్యక్తమైనది ఎవరో అతడే దాదాభగవాన్. అతడు చతుర్దశ భువనాలకు ప్రభువు. అతడు మీలో కూడ ఉన్నాడు. కానీ అతడు మీలో ఇంకా అభివ్యక్తం కాలేదు. ఇక్కడ నాలో అతడు పూర్ణంగా అభివ్యక్తమైనాడు. ఈ అభివ్యక్త పరమాత్మయే ఆధ్యాత్మిక ఫలితాలనివ్వగలడు. అతని పేరును కేవలం ఒకసారి ఉచ్ఛరించిన మాత్రముననే మీకు లాభం చేకూరుతుంది. సరైన అవగాహనతో అతని నామాన్ని మీరు చెప్పినపుడు మీకు అధిక మేలు జరుగుతుంది. ప్రాపంచిక విఘ్నములు లేక

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90