________________
నేను ఎవరిని ?
ప్రశ్నకర్త : ప్రతి ఒక్కరికీ ప్రత్యక్ష పురుషుని కలిసే అవకాశం ఉంటుందా? దాదాశ్రీ : అవును, వారందరికీ ఈ అవకాశం లభిస్తుంది. ఇది కొనసాగుతుంది. ప్రశ్నకర్త : ఇదే విధంగా ఇది కొనసాగుతుందా?
దాదాశ్రీ : ఇది కొనసాగుతుంది. నీకు అర్థమైందా?
56
ప్రశ్నకర్త : : కానీ ఈ అక్రమ మార్గంలో ప్రత్యక్ష పురుషుని అవసరం లేదా? దాదా శ్రీ : జ్ఞానియొక్క ప్రత్యక్ష సాన్నిధ్యం లేకుండా ఏ పనీ జరగదు.
ప్రశ్నకర్త : అవును, అతని సాన్నిధ్యం లేనిచో ఇది పని చేయలేదు. దాదాశ్రీ : లేనిచో ఈ మార్గం మూత పడిపోతుంది. అందువల్ల మీకు ప్రత్యక్ష
పురుషుడు అవసరము.
ప్రశ్నకర్త : క్రమ మార్గపు జ్ఞాని పురుషుడైన కృపాళుదేవుల (శ్రీమద్రారాజ చంద్ర) సందేశాన్ని ప్రజలు ఎవరికి వారు తమకు తోచిన విధంగా వాఖ్యానించ యత్నిస్తున్నారు. మీ విషయంలో కూడ అలా జరిగే అవకాశం ఉంది కనుక ఈ విషయాన్ని ప్రత్యక్షంగా మీ నుంచి వినగోరుతున్నాను. అక్రమమార్గంలో ప్రతి ఒక్కరికీ ప్రత్యక్ష పురుషుడు లభిస్తారా? అని తెలిసికొనగోరుతున్నాను.
దాదాశ్రీ : కొంత కాలం వరకు ఈ అక్రమ మార్గం వృద్ధిపొందుతుంది. ప్రశ్నకర్త : కొద్ది కాలమేనా?
దాదాశ్రీ : అవును, కొంత కాలము వరకే, ఎందుకంటే ఒక ప్రజా సముహము ఈ మార్గముద్వారా శుద్ధిగావింపబడి బయటకు పోవలసి ఉన్నది. ఒకసారి ఇది జరిగితే ఇంక అర్హులైన ప్రజలెవరూ మిగిలి ఉండరు, అందువల్ల ఈ అక్రమమార్గము ముగిసిపోతుంది. ఈ మార్గము ఎంచబడిన కొద్దిమంది (Choosen few) కొరకు మాత్రమే.
ప్రశ్నకర్త : అవును. ఈ కొద్దిమంది కొరకు మాత్రమే, అందువల్లనే మీరు దీనిని అక్రమమార్గం అన్నారు.