________________
నేను ఎవరిని ?
48
అక్రమ జ్ఞానం ద్వారా స్త్రీలకు మోక్షం.
పురుషులు మాత్రమే మోక్షాన్ని పొందగలరని, స్త్రీలకు మోక్షం లేదని ప్రజలు చెప్తారు. నేను చెప్పేదేమంటే స్త్రీలకు కూడ రూఢిగా మోక్షం ఉంది. ఎందుకు లేదు? స్త్రీల ప్రకృతిలో మోహము, కపటము అనే లక్షణాలు చాలా ఎక్కువగా వున్నందున వారికి మోక్షం లేదని ప్రజలు చెప్తారు. అదే బలహీనత పురుషులలో కూడ కనిపిస్తుంది. కానీ స్త్రీలలో అది కొంచెం ఎక్కువ డిగ్రీలో వుంటుంది.
ప్రజలు ఏమి చెప్పినప్పటికీ స్త్రీలు తప్పక మోక్షాన్ని పొందుతారు. వారికి మోక్షార్హత ఉంది, ఎందుకంటే వారు వాస్తవంగా ఆత్మ స్వరూపులు. వారిలో మోహము, కపటము అధిక స్థాయిలో ఉన్నందున వారికి కొంత ఎక్కువ కాలం పట్టవచ్చు.
స్వరూప విజ్ఞానం ద్వారా స్వేచ్ఛ
ఈ మార్గం పూర్తిగా ఆత్మవిషయకము. ఈ మార్గంలో అనాత్మ విభాగం (అశాశ్వతము మరియు మనోవాక్కాయములకు సంబంధించినది) లేదు. ఆత్మ అనగా తలంపులు, వాక్కు మరియు క్రియలతో కూడిన ప్రపంచానికి అతీతమైనది. అనాత్మ అనగా ప్రాపంచికమైనది మరియు మనోవాక్కాయముల అధీనము. అన్ని విధాల ప్రయత్నించి కూడ ముక్తికి మార్గం కన్పించని వారి కోసమే ఈ విజ్ఞానమార్గం. ముముక్షువులు కాని వారికి ఇతర నియమాలు, మార్గాలు ఉండనే ఉన్నాయి. అక్రమమార్గం అన్ని నియమాలనుంచి ముక్తులు కాగోరే వారి కోసమే ఉద్దేశింపబడింది.
ఇది ఆంతరంగిక విజ్ఞానము మరియు శాశ్వతమైనది. ఈ ప్రపంచంలో మీకు కన్పించేదంతా బాహ్య విజ్ఞానము మరియు తాత్కాలికమైనది. ఈ విజ్ఞానం మీకు శాశ్వతానుభూతిని ప్రసాదిస్తుంది. ఇది పూర్ణ విజ్ఞానము. ఈ విజ్ఞానము ముక్తులను చేస్తుంది. మీరు అభ్యసించే ఏ ధర్మమూ మీకు మోక్షాన్నివ్వదు. ధర్మాచరణ ద్వారా మీరు విషయానందాన్ని మరియు అధర్మ మార్గంలో పడకుండా రక్షణను పొందవచ్చు. ఆధ్యాత్మికపురోగతి నుంచి చ్యుతినందకుండా ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మోక్షార్ధము మీకు వీతరాగ విజ్ఞానము (సంపూర్ణ విజ్ఞానము) అవసరము. ఈ విజ్ఞానము ఏ గ్రంధాలలోను లభించదు. తీర్ధంకరులకు ఈ విజ్ఞానము గురించి తెలుసు కాని వారి కాలంలోని ప్రజలకు వారు దానిని అందించలేకపోయారు. ఈ క్లిష్టసమయంలో అరుదైన