________________
47
నేను ఎవరిని ?
ఈ అనుభవాలను చదివిన ప్రపంచం ఆశ్చర్యపోవటం తథ్యం. ఒక వ్యక్తి అంత సడెన్ గా ఎలా మారగలడు? వేలకొద్దీ ప్రజలు తమ జీవితాల్లో ఈ స్పష్టమైన మార్పులను అనుభూతి చెందారు. ఈ మార్పులు శాశ్వతమైనవి. ఈ జ్ఞానానంతరం ఈ ప్రజలు తమలో దాగి ఉన్న తప్పుల్ని మాత్రమే తాము చూచుకొంటారు. వీరు యితరుల దోషాలను చూడరు. ఏ జీవికీ అణుమాత్రమైన హానిచేసే తలంపు వీరికి కలగదు.
ప్రపంచ వ్యాప్తంగా అక్రమవిజ్ఞానం ఇది చిరస్మరణీయమైన అపూర్వ సంఘటన. వేరే ఎక్కడా ఇది జరగలేదు. దాదాజీ మాత్రమే దీనిని నెరవేర్చగలిగారు.
ప్రశ్నకర్త : దాదా! మీ తదనంతరం ఏమి జరుగుతుంది? దాదాశ్రీ : ఇది కొనసాగుతుంది. అర్హత పొందినవారు ఈ పనిని కొనసాగించాలనేది నా కోరిక. ఎవరో ఒకరు ఈ మార్గాన్ని కొనసాగించవలసిన అవసరం లేదా?
ప్రశ్నకర్త : ఆ అవసరం ఉంది. దాదాశ్రీ : నా కోరిక నెరవేరుతుంది.
ప్రశ్నకర్త : ఈ అక్రమ మార్గం కొనసాగినట్లయితే ఇది ఇంకొక నిమిత్తుని ద్వారా జరుగుతుందా?
దాదా శ్రీ : అక్రమ విజ్ఞానం మాత్రమే కొనసాగుతుంది. అక్రమ విజ్ఞానం యొక్క ప్రయోజనం విశ్వవ్యాప్తమవుతుంది. ఒకటి రెండు సంవత్సరాలు ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచమంతా దీని గురించే చెప్పుకొంటుంటారు. ఒక మంచి విషయం, ఒక చెడు విషయం రెండు ఉన్నట్లయితే వాటిలో మంచి విషయాన్ని అమలు పరచటానికి ఎక్కువ సమయం పడుతుంది.
కానీ చెడును అమలు పరచటానికి ఏ మాత్రం సమయం పట్టదు. వెంటనే అమలు పరచవచ్చు. చెడు వ్యాపించినంత శీఘ్రంగా మంచి వ్యాపించదు. దాని కోసం కొంత సమయం పడుతుంది.