________________
45
నేను ఎవరిని ?
శుద్ధి చేస్తాడు. మీ అహంకారాన్నీ, మమకారాన్నీ రెంటిని అతడు తొలగిస్తాడు. అపుడు మీరు శుద్ధాత్మానుభావాన్ని పొందుతారు. మీ ఆత్మానుభూతి మీకు కల్గిన తర్వాత మాత్రమే మీ పని పూర్తవుతుంది.
అక్రమ మార్గం ఎందుకు ఏర్పడింది? క్రమ మార్గం ఒక 'కామా' మరియు అక్రమ మార్గం ఒక 'ఫుల్ స్టాప్'. ఈ అక్రమ మార్గం అరుదుగా దానంతట అదే అభివ్యక్తమౌతుంది. మోక్షానికి ప్రధాన మార్గం క్రమ మార్గం, మెట్టు తర్వాత మెట్టుగా వెళ్ళే మార్గం. కొన్నిసార్లు పరంపరానుగతమైన క్రమ మార్గంలో కలతలు లేక భ్రమలు చోటు చేసికొన్నప్పుడు, మరియు ఆ సమయంలో
మోక్షానికి సిద్ధంగా అర్హతను పొందిన ప్రజలెవరైనా ఉన్నచో వారు జ్ఞాని పురుషుని ద్వారా ముక్తిని కనుగొంటారు.
నా ద్వారా అక్రమమార్గం ఎందుకు వెలుగులోనికి వచ్చిందని చాలామంది బోధకులు, గురువులు నన్ను అడిగారు. క్రమమార్గం బీటలు వారినందున అక్రమమార్గం అభివ్యక్తమైందని నేను వారికి చెప్పాను. క్రమమార్గం యొక్క పునాది పూర్తిగా చెడిపోయింది. అందుకు ఋజువేమిటని వారు అడిగారు. అపుడు నేను వారితో మనోవచనకాయాల ఏకత ఉన్నపుడు మాత్రమే క్రమమార్గం జీవించగలుగుతుందని చెప్పాను (అనగా నీ మనసులో ఉన్న దానిని ఉన్నట్లుగా నీవు చెప్పినపుడు, మరియు నీ ప్రవర్తన నీ మనసుతో, వాక్కుతో ఏకీభవించినపుడు). ప్రస్తుత కాలంలో మనోవచనకాయాల ఏకత లోపించిందని వారు అంగీకరించారు. ఆ కారణంగానే క్రమమార్గం ఫ్రాక్చరైంది.
ఒక చెరుకు గడను నీవు పూర్తిగా తిన్నట్లయితే దానిలో రెండు కణుపులలో మంచి చెరుకురసం నీకు లభించవచ్చు. అలాకాక చెరుకు గడ పూర్తిగా కుళ్ళిపోయి వుంటే నీవు దానిని నమల ప్రయత్నిస్తావా లేక తిరిగి యిచ్చేస్తావా?
ప్రశ్నకర్త : తిరిగి యిచ్చేస్తాను. దాదా శ్రీ : దానిని తిరిగి తీసికొమ్మని, ఇంకెవరికైనా యివ్వమని నువ్వు అమ్మకం దారుకి చెప్తావు. చాలా చెరుకు తిన్నట్లుగా కూడ నీవు అతనికి చెప్తావు. ఈ క్రమ మార్గం కుళ్ళిన చెరుకులా తయారైంది. ఎవరు మాత్రం ఏమి చేయగలరు? ప్రజలు