________________
నేను ఎవరిని ?
చెప్పబడుతుంది. క్రమ మార్గంలో కొన్ని పనులను తప్పనిసరిగా చేయవలసిందిగా సాధకులకు చెప్పటం జరుగుతుంది. మీ బలహీనతలైన క్రోధ మాన మాయా లోభాలనుంచి మీరు విముక్తి పొందాలనీ, మంచి విషయాలవైపు మరలమనీ మీకు బోధించటం జరుగుతుంది. ఇంతకాలం ఇదేకదా మీకు ఎదురైన అనుభవం? అక్రమ మార్గం విషయానికొస్తే మీరు చేయవలసింది ఏమీ లేదు. ఏమీ చేయనవసరం లేదు. ఎపుడైన ఎవరైన మీ జేబు కత్తిరించినప్పటికీ అక్రమ విజ్ఞానం ప్రకారం మీ అవగాహన ఇలా ఉంటుంది. “అతను జేబు కత్తిరించలేదు. మరియు కత్తిరించబడిన జేబు నాది కాదు”. కానీ క్రమ మార్గంలో జేబు కత్తిరించిన వారిని దోషిగా చూసి నిందించటం జరుగుతుంది. మరియు "అతడు కత్తిరించింది నా జేబు” అనే నమ్మకం ఉంటుంది.
అక్రమ విజ్ఞానం ఒక లాటరీ వంటిది. నీవు లాటరీ గెల్చినపుడు అక్కడ నీ ప్రయత్నం ఏమైనా ఉంటుందా? ఎంతోమంది లాటరీ టిక్కెట్లు కొన్నారు.
కానీ విజేతవు నీవు మాత్రమే. అదే విధంగా ఈ అక్రమ విజ్ఞానం రెడీ క్యాష్ వలె మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
అక్రమ మార్గానుభూతి ప్రశ్నకర్త : ఎవరైనా అక్రమ విజ్ఞానాన్ని వారి గతజన్మ కర్మల కారణంగా పొందుతారా?
దాదా శ్రీ : అవును. వారి కర్మఫల కారణంగానే ఎవరైనా నన్ను కలవగలుగుతారు. లక్షల కొద్దీ జన్మల పుణ్య సంచయం వల్లనే వారికి ఇటువంటి మార్గం లభిస్తుంది.
మిగిలినవన్నీ క్రమ మార్గాలు. క్రమ మార్గం అంటే అనాత్మ మార్గం. ఆ మార్గం ప్రాపంచిక లాభాలను చేకూరుస్తుంది. ఒక్కొక్క మెట్టుగా చాలా నెమ్మదిగా మిమ్మల్ని మోక్షం వైపు తీసుకెళ్తుంది. ఈ మార్గంలో త్యాగం మరియు తపస్సు ద్వారా సాధకులు తమ అహంకారాన్ని తామే శుద్ధిచేసికొనవలసి వుంటుంది. ఒకసారి ఈ అహంకారం శుద్ధి అయితే అది మోక్ష ద్వారం వద్ద వుంటుంది. క్రోధం, గర్వం, మాయ, దురాశ, లోభం అనే బలహీనతల నుంచి అహంకారం శుద్ధి చేయబడాలి. క్రమమార్గం చాలా సంక్లిష్టమైన మార్గం. అక్రమ మార్గంలో జ్ఞాని పురుషుడు మీ కోసం మీ అహంకారాన్ని