________________
43
నేను ఎవరిని ? ఎవరు నన్ను కలుస్తారో వారు అక్రమజ్ఞానానికి అర్హులు.
ప్రశ్నకర్త : ఈ సరళ మార్గాన్ని పొందటానికై మేము ఏ విధమైన అర్హతలూ కల్గియుండవలసిన అవసరం లేదా ?
దాదాశ్రీ : కొంతమంది నన్ను “ఈ అక్రమ జ్ఞానం పొందటానికి నేను అర్హుడినేనా” అని అడుగుతుంటారు. "నన్ను కలుసుకోవటమే మీ అర్హత” అని నేను వారికి చెప్తాను. ఈ కలయిక సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్ కారణంగా జరుగుతుంది. అందువల్ల నన్ను కలిసినవారెవరైనా అర్హులే. ఎవరు నన్ను కలవలేదో వారు అనర్హులు. మీరు నన్ను కలవటం వెనుక ఉన్న కారణం ఏమిటి ? మీ అర్హత కారణం గానే ఈ కలయిక సంభవించింది. ఏమైనప్పటికీ ఒకరు నన్ను కలిసిన తర్వాత కూడ ఆత్మానుభూతిని పొందకపోయినట్లయితే, అపుడు దానికి కారణం అతని అంతరాయ కర్మ అతని కార్యసిద్ధిని నిరోధించటమే.
అంతిమ లక్ష్యం. ప్రశ్నకర్త : ఇది ఒక విధమైన దగ్గరిదారా ? దాదాశ్రీ : అవును, ఇది నిశ్చయంగా దగ్గరిదారి. ఇది సూటియైన మార్గం. ప్రశ్నకర్త : దీని అంతిమ లక్ష్యం ఏమిటి? దాదా శ్రీ : శాశ్వతమైన ఆనందాన్ని, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని, బంధాలనుంచి స్వేచ్ఛను పొందటం దీని అంతిమ లక్ష్యం.
ప్రశ్న కర్త : శాశ్వతానందం అంటే ఏమటి ? దానిని వివరించగలరా? దాదాశ్రీ : నీవు దానికై ఏ ప్రయత్నమూ చేయకుండానే నీకు అత్యంత సహజంగా లభించే ఆనందం శాశ్వతానందం. ఇది శాశ్వతంగా నిలిచి వుంటుంది. ఇందులో దు:ఖము లేక బాధ ఉండదు.
క్రమ, అక్రమ మార్గాల మధ్య వ్యత్యాసము దాదాశ్రీ : క్రమ, అక్రమ మార్గాల మధ్య భేదాన్ని వివరించమని కొంత మంది కోరారు. క్రమ మార్గంలో చెడుపనులు చేయటం ఆపాలనీ, మంచి పనులు చేయాలనీ