________________
నేను ఎవరిని ?
తప్పనిసరిగా సమాధానాలు పొందాలి. ఈ లిఫ్ట్లో ప్రవేశించాక, తాము మోక్షానికే ప్రయాణిస్తున్నట్లు వారికి ఎలా తెలుస్తుంది? మీ కోపము, దురాశ, లోభము, గర్వము అన్నీ వెళ్ళిపోవటమే మీకు నిదర్శనం. మానసిక వేదన తొలగిపోతుంది. అంతరంగంలో చింత (ఆర్తధ్యానము) అనేది ఇక ఉండదు. ఇతరులకు హాని కలిగించే రౌద్రధ్యానమూ ఉండదు. ఇదే మీకు నిశ్చయము. పని పూర్తి అయినట్లే అవునా?
41
ప్రశ్నకర్త : క్రమ మార్గం ప్రధానం మార్గం కాదా? ఈ అక్రమ మార్గం పూర్తిగా కొత్తది అవునా?
దాదాశ్రీ : అవును, క్రమమార్గం ప్రధాన మార్గం అయినప్పటికీ ఇది తపస్సు, త్యాగంవంటి వాటితో కూడి ఉన్నది. ఈ మార్గంలో లక్ష్యాన్ని చేరటానికి చాలా బాధలు పడవలసి వుంటుంది. వారి తపస్సు యొక్క స్థాయిపై వారి అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. క్రమ మార్గం పూర్తిగా తపస్సుతో నిండి ఉన్నది.
ప్రశ్నకర్త : ఏ బాధలూ సహించకుండా, ఏ వేదన (శ్రమ) లేకుండా క్రమ మార్గంలో అభివృద్ధిని పొందలేరన్నది నిజమేనా?
దాదాశ్రీ : అవును, క్రమ మార్గం అత్యంతమూ బాహ్యంగానూ, ఆంతరంగికంగానూ కూడ బాధలతో కూడినది. ఇది బంగారాన్ని శుద్ధి చేయటం వంటిది. అగ్ని యొక్క వేడి (బాధలు) లేకుండా అది సాధ్యం కాదు. కొలిమిలో కాల్చినపుడే అది శుద్ధి
అవుతుంది.
ప్రశ్నకర్త : క్రమమార్గంలో వలె అక్రమ మార్గంలో కూడ నియమాలున్నాయా?
దాదా శ్రీ : లేవు. ఎక్కడైతే నియమం ఉంటుందో, అది అనాత్మకి సంబంధించినదై ఉంటుంది. ఈ భంగిమలో కూర్చోవాలి అనే నియమం అనాత్మకి చెందినది. అక్రమ మార్గంలో ఏ నియమాలు లేవు. మోక్షానికి ఇంత సులువైన మార్గం ఉన్నప్పటికీ చాలా తక్కువమంది ముముక్షువులు దీని ప్రయోజనాన్ని పొందుతున్నారు.
ప్రశ్నకర్త : ఏ ప్రయత్నమూ లేకుండా మోక్షాన్ని పొందటం సాధ్యమే అని అంగీకరించుటకు మనసు ఒప్పుకోవటం లేదు. అందువల్లనే వారు తిరస్కరిస్తున్నారు.