________________
39
నేను ఎవరిని ? అంధకారాన్ని పారద్రోలుటకు ఎంతకాలం పడుతుంది?
ప్రశ్నకర్త : ఆత్మానుభూతిని పొందుటకు వేదాలలో అనేక మార్గాలు వివరించబడినవి. వివేకము, వైరాగ్యము, ముముక్షుత్వము అనే లక్షణాలను వ్యక్తి సాధించవలసి వుంటుంది. వీటి సాధనకు సమయము, ప్రయత్నము అవసరము. మరి ఇంత తక్కువ సమయంలో ఈ జ్ఞానాన్ని పొందటం ఎలా సాధ్యం?
దాదా శ్రీ : జ్ఞానాన్ని పొందటానికి సమయం పట్టదు. చీకటిగా వున్న గోతిలోనికి ఒక ఫ్లాష్ లైట్ ను త్రిప్పితే తక్షణమే చీకటి తొలగి వెలుగు కనిపిస్తుంది. అదే విధంగా, జ్ఞాన ప్రకాశంలో అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుటకు జ్ఞాని పురుషునికి ఏమాత్రం సమయం పట్టదు. ఆ తర్వాత నువ్వు కాలు జారి పడవు.
ప్రశ్నకర్త : ఈ జ్ఞానాన్ని పొందే వ్యక్తి ఆధ్యాత్మికోన్నతిని కల్గి ఉండాలా? దాదా శ్రీ : మనిషి గత అనేక జన్మలలో ఈ ఆధ్యాత్మిక స్థాయిని చేరి వున్నాడు. తన నిజ స్వరూప జ్ఞానం లేనందువల్ల అహంకారం అతనిని తప్పు దారి పట్టించింది. ఆధ్యాత్మిక స్థాయిలో అతడు అభివృద్ధి చెందిన కొద్దీ అతని అహంకారం మరింతగా బలపడింది. అతడు అభ్యసించిన వివేక వైరాగ్యాలు అతనిలో ఆధిక్య భావనను వృద్ధి చేయటానికి మాత్రమే పనికి వచ్చాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇంకా అతను కాలు జారి పడుతూనే వున్నాడు. అయినప్పటికీ “నేను ప్రత్యేకమైనవాడిని” అని చెప్పుకుంటూనే ఉన్నాడు. అతడు చాలా ఆధ్యాత్మిక సాధనలు చేసినప్పటికీ తన నిజస్వరూపాన్ని అనుభవ పూర్వకముగా తెలుసుకోలేదు.
నీ అస్తిత్వం (నీవు ఉన్నావనే జ్ఞానం) ఉంది. ఈ విషయంలో సందేహం లేదు. వస్తుత్వ జ్ఞానం (నీవెవరివి అనే జ్ఞానం) నీకు లేదు. ఎప్పుడు జ్ఞాని పురుషుడు నీ పాపాలను ప్రక్షాళనం చేస్తాడో అపుడు నీకు వస్తుత్వ జ్ఞానం (ఆత్మానుభూతి) లభిస్తుంది. ఒకసారి నీవు ఆత్మానుభూతి పొందితే అప్రయత్నంగా పూర్ణస్థితికి (పరిపూర్ణ పరమాత్మ దశ) అభివృద్ధి చెందుతావు. అపుడు నీవు ఏమీ చేయవలసినపని లేదు. నీవు స్వతంత్రుడవవుతావు. నీ దృష్టి కోణంలో మాత్రమే భేదం వస్తుంది. ఇపుడు నీ