Book Title: Who Am I
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 47
________________ నేను ఎవరిని ? 8 స్థిరంగా వుంటుంది. కానీ లక్ష్యం చలిస్తూ అపుడపుడు స్వల్పకాలం పాటు పోతుంది. మనం పరధ్యానంగా ఉన్నపుడు లేదా మన పనులలో మునిగిపోయినపుడు ఆ పరిమిత కాలంలో మనం జాగృతిని కోల్పోవచ్చు కానీ ఏ క్షణం మనం మన పనులనుంచి విరామం పొందుతామో ఆక్షణం అది తిరిగి వస్తుంది. లౌకిక వ్యవహారాలనుంచి, బాధ్యతలనుంచి విడుదలై ఏకాంతంలో కూర్చున్నపుడు పొందే అనుభవమే ఆత్మానుభూతి. ఈ అనుభవం క్రమక్రమంగా వృద్ధిపొందుతుంది. అందువల్ల ఇదివరకటి చందులాల్ కి ఇప్పటి చందూలాల్ కి ఉన్న తేడాను ఎవరైనా ఇట్టే గ్రహిస్తారు. ఈ మార్పుని ఎవరు తీసికొచ్చారు? ఆత్మానుభూతే దీనికి కారణం. ఇంతకు ముందు మీరు దేహాధ్యాసలో (భౌతిక దేహక్రియలు, దాని యొక్క ఉద్రిక్త స్వభావం మాత్రమే ఎరిగిన స్థితి) ఉండేవారు, కానీ యిప్పుడో ఆత్మలో స్థిరపర్చబడ్డారు. ప్రశ్నకర్త : ఆత్మానుభూతి వల్ల ఏమి జరుగుతుంది? దాదాశ్రీ : ఆత్మానుభూతి కలగటం వల్ల దేహాధ్యాస (దేహమే నేను అనే భ్రమ) తొలగిపోతుంది. ఎపుడు దేహాధ్యాస పోతుందో అపుడు కొత్త కర్మలు నిన్ను బంధించటం ఆగిపోతుంది. ఇంతకంటే నీ కేమి కావాలి? ప్రశ్నకర్త : నాకు ఈ జ్ఞానమార్గాన్ని చూపవలసినదిగా మిమ్మల్ని కోరుతున్నాను. దాదాశ్రీ : అవును. నీకు ఈ మార్గాన్ని చూపిస్తాను. నేను నీకీ మార్గాన్ని చూపటం మాత్రమే కాక నీ ఆత్మను నీ చేతుల్లో కూడ పెడతాను. ప్రశ్నకర్త : అయితే నా మానవజన్మకి పరమార్ధం చేకూరినట్లే. ఇంతకంటే నాకు కావలసినదేమున్నది? దాదా శ్రీ : అవును. పూర్తిగా నెరవేరుతుంది. అనంత జన్మలలో స్వప్రయత్నంతో నీవు పొందలేని దానిని నేను ఒకే ఒక గంటలో నీకు ప్రసాదిస్తాను. అపుడొక మనిషిగా నీ లక్ష్యాన్ని సాధించినట్లు నీవు గ్రహిస్తావు. వేయి జన్మల కఠిన పరిశ్రమతో కూడ దీనిని నీవు సాధించలేవు.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90