________________
నేను ఎవరిని ?
ప్రశ్నకర్త : నేను ఇటువంటి స్వేచ్ఛని కల్గి ఉంటూ కూడ ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చునంటే ఇది చాలా విలువైనది. నాకు చాలా ఆసక్తిగా ఉంది.
దాదా శ్రీ : నీవు కోరినంత స్వేచ్ఛను పొందవచ్చు. ఇది ఆత్మజ్ఞానానికి షార్ట్ కట్ మార్గము. ఈ మార్గంలో నీవు చేయవలసిన ప్రయత్నం ఏమీ ఉండదు. నేను మీ ఆత్మను మీ చేతుల్లో పెడతాను. ఇక మీకు మిగిలేది పరమసుఖాన్ని లేదా నిరతిశయ ఆనందాన్ని అనుభవించటమే. ఇది లిఫ్ట్ మార్గము. నీవు లిఫ్ట్ లో ఉండు (ఐతిహ్యమైన క్రమమార్గము, మెట్ల దారి కంటే మోక్షానికి ఇది దగ్గర దారి). వేరే కొత్త కర్మలు నిన్ను బంధించవు. నీవు చేయవలసినది నా ఆజ్ఞలను పాటించడం మాత్రమే; అందువల్ల ఇంకొక్క జన్మలోనే మీ కర్మలన్నీ పూర్తి అయ్యి ఫలితం లభిస్తుంది. ఈ మార్గంలో మీరు దారి తప్పిపోకుండా, విఘ్నాలు ఏమీ కలుగకుండా ఉండటం కోసం నేను మీకు ఈ ఆజ్ఞలు యిస్తాను.
ప్రశ్నకర్త : ఈ జ్ఞానం పొందిన తర్వాత నాకు ఇంకొక్క జన్మ ఉండటం తప్పదా? దాదాశ్రీ : నీకు గతజన్మ వుంది, భవిష్యజన్మ కూడా ఉంటుంది. ఈ
జ్ఞాన ప్రభావం ఎంతటిది అంటే అది ఒకటి లేక రెండు జన్మలలో మీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
మొదట అజ్ఞానం నుంచి మోక్షం లభిస్తుంది. ఒకటి లేక రెండు జన్మల తర్వాత అంతిమ మోక్షం లభిస్తుంది. ప్రస్తుత కాలచక్రం కారణంగా నీవు ఇంకా ఒక జన్మను పొందవలసి వుంటుంది.
ఇంకోసారి తిరిగి నా వద్దకు రండి. మనం జ్ఞాన విధి తారీఖును నిర్ణయిద్దాం. జ్ఞానవిధి యొక్క ఆ ప్రత్యేక దినాన అనంతజన్మల నుంచి మిమ్మల్ని బంధించి ఉంచిన అజ్ఞానమనే త్రాళ్లను నేను తెగనరుకుతాను. ప్రతిరోజు వాటిని కోయవలసిన అవసరం లేదు. ఒకవేళ అలా చేయవలసి వుంటే మీరు రోజూ వెళ్లి రోజుకొక క్రొత్త బ్లేడు కొనవలసి ఉంటుంది. నిర్ణయించిన
జ్ఞానవిధి రోజున నేను త్రాడు యొక్క ఒకే ఒక చుట్టును మాత్రమే కోస్తాను. అపుడు వెంటనే నీవు స్వేచ్ఛను పొందిన విషయాన్ని గుర్తిస్తావు. ఆ స్వేచ్ఛానుభూతి చాలు. అది కలకాలం నిలిచివుంటుంది. ఈ మోక్షం జోక్ కాదు. నిజంగానే నేను మిమ్ములను ముక్తులను చేస్తాను.