________________
35
నేను ఎవరిని ? మోక్షాన్ని పొందుతారు. ఎవరు బాధపడుతున్నారో వారే ముక్తి పొందుతారు. ఆత్మసదా ముక్తమే. మోక్షమే ఆత్మ యొక్క దశ.
ఎవరు బంధింపబడ్డారో, బంధనాలవల్ల ఎవరు బాధపడతారో వారే స్వతంత్రం కోసం వెదుకుతారు. శృంఖలాల బాధను అనుభవించేది అహంకారమే. అందువల్ల ఆ అహంకారమే ముక్తి పొందవలసి ఉన్నది. అజ్ఞానం తొలగనంత వరకు అహంకారానికి ముక్తి లేదు. ఎపుడైతే నీవు జ్ఞాని పురుషుని నుంచి జ్ఞానాన్ని పొందుతావో అపుడు అజ్ఞానం తొలగి అహంకారం ముక్తిని పొందుతుంది. జ్ఞానం మాత్రమే అన్ని దు:ఖాలను అంతం చేయగలదు.
ఈ ప్రపంచం దు:ఖాల ఊబిలో కూరుకుని పోయింది. దు:ఖానికి కారణం ఏమిటి? ఆత్మను గురించిన అజ్ఞానం నుంచి ఈదు:ఖం శాఖోపశాఖలుగా విస్తరించింది. ప్రపంచంలోని దు:ఖాని కంతటికీ మూలం అజ్ఞానమే. ఈ అజ్ఞానమే రాగ ద్వేషాలకు దారితీసి దు:ఖానుభూతిగా పరిణమిస్తుంది.
జ్ఞానం మాత్రమే ఈదు:ఖాన్ని మాన్పగలదు. దీనికి వేరే మార్గం లేదు. దు:ఖం మిమ్ములను స్పృశించకుండా జ్ఞానం రక్షణనిస్తుంది.
(8) అక్రమ మార్గం అంటే ఏమిటి?
అక్రమ జ్ఞానం యొక్క అత్యధిక శక్తులు. ప్రశ్నకర్త : వివాహితుడైన సంసారికి కూడ తేలికగా ఆత్మజ్ఞానం పొందటం సాధ్యమా ? దాదా శ్రీ : అవును. అటువంటి మార్గం వుంది. భార్య, పిల్లలతో జీవిస్తున్నప్పటికీ ఆత్మజ్ఞానం పొందటం సాధ్యమే. ప్రపంచంలో జీవనం కొనసాగిస్తూ, తండ్రిగాను, ఇంకా ఇతర సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడ ఆత్మజ్ఞానాన్ని మీరు పొందగలరు. మీకు దానిని ప్రసాదించగలుగుతున్న నేను కూడ నా వరకు నేను సంసార జీవనం కొనసాగిస్తున్నాను. ఆత్మజ్ఞానం తర్వాత కూడ మీరు స్వేచ్ఛగా కోరుకున్న విధంగా జీవించవచ్చు. సినిమాకి వెళ్లండి,
పిల్లల వివాహం చేయండి. అందమైన వస్త్రాలు ధరించటం లాంటివి అన్నీ చేయండి. మీకు ఇంకా ఏ గ్యారంటీ కావాలి?