________________
నేను ఎవరిని ?
జీవించి ఉండగానే సమాధి సుఖాన్ని పొందటం మోక్షం యొక్క మొదటి దశ. దు:ఖం యొక్క ఆత్యంతిక నివృత్తి, నీదైన ఆనందాను భూతిని పొందటం సమాధి. ఇది మొదటి దశ. దేహ త్యాగానంతరం పొందేది మోక్షం యొక్క రెండో దశ.
కానీ మోక్షం యొక్క మొదటి దశను జీవితకాలంలో ఇప్పుడే పొందాలి. మోక్షం యొక్క ఈ మొదటి దశను నేను సదా అనుభవిస్తున్నాను. ప్రపంచ వ్యవహారాలలో జీవిస్తూ కూడ వాటి వల్ల ప్రభావితం కాని సుఖమే మోక్షం. సంసారంలో ఉంటూ కూడ అది నిన్ను స్పృశింపక పోవటమే మోక్షము. ఏ రకమైన నిర్బంధాలు లేని అటువంటి మోక్షం కోసమే ఎవరైనా తపించవలసి ఉన్నది. అటువంటి మోక్షదశ అక్రమ విజ్ఞానం ద్వారానే సాధ్యం.
దైనందిన జీవితంలో మోక్షానుభూతి. ప్రశ్నకర్త : అటువంటి స్వేచ్ఛ లేక మోక్షాన్ని (జీవన్ముక్తి) జీవితకాలంలో ఎవరైనా అనుభవించారా? లేక అది మరణం తర్వాత లభించే మోక్షమా?
దాదాశ్రీ : మీరు చనిపోయిన తర్వాత లభించే స్వేచ్ఛవల్ల ప్రయోజనం ఏమిటి? మరణించిన తర్వాత మోక్షం వస్తుందని చెప్పేవారి వాగ్దానాలు నమ్మి ప్రజలు ఇలాగే మోసపోతున్నారు. జీవితకాలంలో అనుభవానికి రాని మోక్షం వల్ల ప్రయోజనం ఏమిటి?
మోక్షం యొక్క రుచి ఏమిటో ఇప్పుడే ఇక్కడే నువ్వు అనుభవించి తెలుసుకోవాలి. లేకుంటే మోక్షం అనేది ఒకటి ఉన్నదని ఎలా నమ్మకం కుదురుతుంది? మరణం తర్వాత మోక్షం అరువు తెచ్చుకొన్న మోక్షం వంటిది. అలా అరువు తెచ్చుకొన్న వాటి పై ఆధారపడకూడదు. రెడీ క్యాష్ వలె మోక్షం నీ చేతుల్లో ఉండాలి. అటువంటి మోక్షాన్ని జీవించి ఉండగా నీవు అనుభవించగలవు. జనకమహారాజు తన జీవితకాలంలోనే మోక్షాన్ని అనుభవించాడు. దీని గురించి నువ్వు విన్నావా? ప్రశ్నకర్త : విన్నాను.
మోక్షాన్ని సాధించేది ఎవరు? ప్రశ్నకర్త : వాస్తవంలో, మోక్షాన్ని పొందేది ఎవరు? దాదాశ్రీ : మోక్షం ద్వారా విడుదలయ్యేది అహంకారం మాత్రమే. బంధింపబడినవారే