________________
33
నేను ఎవరిని ?
పొందే మార్గంలో ఆయన ఒక సాధనం లేదా కారణభూతుడు అవుతాడు.) మోక్షం నైమిత్తికమైనది (ఒక సాధనం ద్వారా పొందవలసినది). నీవు నన్ను కలుసుకోవటం కూడ ఒక నైమిత్తిక క్రమమే. వాస్తవంలో మోక్షాన్ని ఇచ్చేవారు గానీ పుచ్చుకునేవారు గాని ఎవరూ లేరు. నీకు చెందిన ఏదైనా వస్తువును నీవు యిచ్చినట్లయితే అపుడు
నీవు దాతవు అవుతావు. ఏదైనా వస్తువును నీవు యింకొకరికి యిచ్చినపుడు నీవు దాని పై నీకు గల అధికారాన్ని కోల్పోతావు. కానీ మోక్షం నీ జన్మహక్కు. జ్ఞానం ద్వారా
నీ నిజస్వరూపాన్ని నీకు ఎరుకపర్చటంలో నేను నిమిత్త మాత్రుడిని మాత్రమే. నేను కేవలం సాధనాన్ని. ఇప్పటికే నీది అయిన దానిని నేను నీకు యివ్వలేను. నేను యిచ్చేవాడిని కాదు, నువ్వు పుచ్చుకొనే వాడివీ కాదు. మోక్షం అనగా సనాతన సుఖము లేక శాశ్వతానందము. ప్రశ్నకర్త : మోక్షాన్ని పొందటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? దాదా శ్రీ : కొంతమంది ప్రజలు నాతో తమకు మోక్షకాంక్ష లేదని చెప్తారు. అపుడు నేను వారిని “మోక్షం యొక్క అవసరం మీకు లేక పోవచ్చు కానీ మీరు సంతోషాన్ని కోరుకోవటం లేదా? దు:ఖమే మీకు యిష్టమా?” అని అడుగుతాను. తాము సంతోషాన్ని కోరుకుంటున్నామని వారు చెప్తారు.
నిజంగా మోక్షం అంటే ఏమిటో ప్రజలకు తెలియదు. కానీ వారు మోక్షం అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. మోక్షం ఏదో ఒక ప్రత్యేక
స్థలంలో ఉందని, అక్కడకు చేరటం వలన దానిని అనుభవించవచ్చునని అభిప్రాయపడుతుంటారు. కాని అది యదార్ధం కాదు.
మోక్షం యొక్క రెండు దశలు. ప్రశ్నకర్త : సాధారణంగా, జనన మరణ చక్రం నుంచి విడుదల కావటం లేదా స్వేచ్ఛను పొందటమే మోక్షం అని మేము తలుస్తాము. దాదా శ్రీ : అవును అది నిజమే,
కానీ అది మోక్షం యొక్క చివరి దశ. అదే రెండవ దశ. సంసార సమస్యలు, దు:ఖాలలో చలించని తటస్థస్థితి మోక్షం యొక్క మొదటి దశ. జీవితంలోని సుఖదు:ఖాలు రెండూ అతనిని స్పృశించలేవు (కలత పెట్ట జాలవు).