________________
నేను ఎవరిని ? దృష్టి కోణం వేరు, నా దృష్టి కోణం వేరు. నీ దృష్టి కోణాన్ని మార్చటం మాత్రమే నేను చేస్తాను. ఇది జ్ఞాని పురుషుని యొక్క పని. దివ్యానుగ్రహం లేకుండా ఇది సాధ్యం కాదు.
ఆత్మకి అనాత్మకి మధ్య భేదరేఖ ఈ అక్రమ విజ్ఞానం వల్లనే మీరు ఇంత తక్కువ సమయంలో సమకిత్ దశను (ఆత్మానుభూతిని) పొందగల్గుతున్నారు. ఈ కాలంలో పరంపరానుగతమైన క్రమమార్గం ద్వారా ఈ సమకిత్ స్థితిని పొందటం అసాధ్యం. అక్రమ విజ్ఞానము చాలా ఉన్నత విజ్ఞానము. అందువల్లనే ఇది ఆత్మ అనాత్మల మధ్య అనగా నీకు,
నీవు కాని దానికి మధ్య చాలా స్పష్టమైన విభజనను చేస్తుంది. వాటి ధర్మాలను, గుణవిశేషాలను అక్రమ విజ్ఞానం స్పష్టంగా నిర్వచించింది. స్పష్టమైన ఈ భేదరేఖ కారణంగానే వెనువెంటనే అనుభవాత్మకమైన ఫలితం కలుగుతుంది. క్రమ మార్గంలో
ఈ భేదరేఖ స్పష్టంగా నిర్వచింపబడని కారణంగా లక్ష్యాన్ని చేరటం చాలా కష్టం. ఒకసారి ఆత్మ అనాత్మల విభజన జరిగిన తర్వాత ఆత్మ ఎన్నడూ అనాత్మ కానేరదు; అనాత్మ ఎన్నడూ ఆత్మ కాజాలదు. వాటి విభజన జరగనంతవరకు అవి తమతమ స్వభావాలలో ఉండజాలవు.
క్రమ మరియు అక్రమ మార్గాలు. తీర్ధంకరుల యొక్క జ్ఞానము క్రమజ్ఞానము, అనగా వారి పరిశ్రమ స్థాయిని బట్టి క్రమేపి అనుభూతిని పొందటం జరిగింది. వారి పరిగ్రహము (ఇది నాది అనే భావము) తగ్గుతున్న కొద్దీ మోక్షమార్గంలో పురోభివృద్ధి కలుగుతుంది. ఈ మార్గంలో లక్ష్యం చేరటానికి అనేక జన్మలు పడుతుంది.
కానీ యిది అక్రమ విజ్ఞానం. ఇక్కడ మెట్లు ఎక్కవలసిన అవసరం లేదు. లిఫ్ట్ ఎక్కి తేలికగా పన్నెండవ అంతస్తుకి వెళ్లవచ్చు. ఇదే అక్రమ మార్గం యొక్క ప్రత్యేకత. కేవలం లిఫ్ట్ ని కనుక్కొని దానిలో ఎక్కితే చాలు. వారికి మోక్షం అరచేతిలో ఉంటుంది. మీకు ఈ మార్గాన్ని చూపటంలో లేదా సరైన దిశా నిర్దేశం చేయుటలో నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి. లిఫ్ట్ లో ఎవరు ఎక్కినా అన్ని సమాధానాలు లభిస్తాయి. అందరూ