________________
నేను ఎవరిని ? చిక్కుల్లో, భ్రమల్లో తగుల్కొన్నారు. వారు అలౌకిక విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ప్రాపంచిక సుఖాలను ఎలా అనుభవించాలా అనేది మాత్రమే వారి లక్ష్యమైంది.
ఎవరైనా మనోవచనకాయాల ఏకతను కల్గి యున్నట్లయితే వారు క్రమ మార్గంలో అభివృద్ధి చెందగలరు. లేనిచో ఆ మార్గం నిష్ప్రయోజనం.
అక్రమ మార్గం. ప్రస్తుత కాలంలో క్రమమార్గం యొక్క పునాది సమూలంగా శిధిలమైపోతున్నది. ఫలితంగా ఈ అక్రమమార్గం అభివ్యక్తమైంది. అక్రమమార్గం స్వతంత్రంగా అభివ్యక్తంకాదు. క్రమమార్గం దానంత అది రిపేరు కావటానికి మూడు వేల సంవత్సరాల వరకూ పడుతుంది. అప్పటివరకు అక్రమ మార్గం ఉంటుంది. క్రమమార్గం తిరిగి స్వస్థతను పొందిన తర్వాత, అక్రమమార్గం యొక్క ఆవశ్యకత ఉండదు. ఈ అక్రమ విజ్ఞానం శాశ్వతంగా ఉండబోదు. క్రమమార్గం స్థానంలో ఇది వ్యక్తమైంది.
ప్రశ్నకర్త : మీరు లిఫ్ట్ ను నిర్మించబోతున్నారా? దాదా శ్రీ : అవును. నిజంగా ఇది ఒక లిఫ్ట్. నేను ప్రజలకు మెట్లెక్కమని చెప్పినట్లయితే దానికై వారికి శాశ్వతకాలం పడుతుంది. అందువల్ల నేను దాదాయొక్క లిఫ్టులో కూర్చోమని ఆహ్వానించాను. భోగభాగ్యాలలో, సుఖాలలో జీవించే ఈ ధనవంతులు కూడ నన్ను వదలరు.
అక్రమ విజ్ఞానం ద్వారా అమూల్యమైన మార్పు అక్రమవిజ్ఞానం ఒక ఆశ్చర్యం. ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత మనుష్యులు వెంటనే చెప్పుకోదగిన మార్పుని అనుభూతి చెందుతారు. ఈ అనుభవం గురించి విన్న ప్రజలు ఈ మార్గానికి ఆకర్షితులౌతారు. ఈ జ్ఞానాన్ని పొందిన ఈ ప్రజలందరినీ తమ అనుభవాల గురించి వ్రాయమని నేను ఉపదేశించాను ; దాదాని కలవక ముందు వారెలా ఉండేవారు, దాదాని కలిసిన తర్వాత ఏ మార్పులను అనుభూతి చెందారు అనేవి వ్రాయమన్నాను.