________________
31
నేను ఎవరిని ? మర్యాదపూర్వకమైన జీవితాన్ని జీవించటానికి సాయపడింది ఆ గురువే. గురువు లేనిచో జీవితంలో పవిత్రత అనేదేవుండదు. మీరు ఒక జ్ఞాని పురుషుని కల్సుకోబోతున్న విషయాన్ని మీ గురువుకి కూడా చెప్పవచ్చు. కొంతమంది తమ గురువును కూడా నా వద్దకు తీసుకొని వస్తుంటారు. ఆ గురువు కూడా మోక్షాన్ని కోరతాడు. గురువు లేకుండా లౌకిక జ్ఞానమూ, పారలౌకిక జ్ఞానమూ కూడా లభించదు. లౌకిక జీవనానికి గురువు యొక్క ఆవశ్యకత, మోక్షార్ధం జ్ఞాని పురుషుని ఆవశ్యకత ఉంది.
(7) మోక్షం (సంపూర్ణ స్వేచ్ఛ)
యొక్క స్వరూపం ఏమిటి?
ఏకైక లక్ష్యం కల్గి వుండాలి. ప్రశ్నకర్త : మనిషికి ఉండదగిన లక్ష్యం ఏమిటి ? దాదాశ్రీ : మోక్షమే ఏకైక లక్ష్యం అయి వుండాలి. నీవు ముక్తిని కోరటం లేదా? ఎంతకాలం లక్ష్యరహితంగా సంచరించాలనుకొంటున్నావు ? అనంత జన్మలుగా నీవు చేసినది ఇదే. ఇంకా సంచరించవలసిన స్థానం ఏదీ నువ్వు మిగల్చలేదు. జంతుగతి, మనుష్యగతి మరియు దేవగతి (స్వర్గ సంబంధమైనది) - వివిధ గతులలో నీవు లక్ష్య రహితంగా సంచరించావు.
అంతం లేని ఈ పరిభ్రమణ వేదన నీవు ఎందుకు పొందినట్లు? నీ నిజమైన గుర్తింపు నీకు తెలియక పోవటమే దీనికి కారణం, “నే నెవరిని” అనే ప్రశ్నకి నీకు సమాధానం తెలియదు. నీ నిజ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవద్దా ? అసంఖ్యాకమైన జన్మల పరిభ్రమణం తర్వాతనైన నిజానికి నీవెవరివో కూడ నీకు తెలియదు. ధనార్జనమే జీవితంలో నీకు ఏకైక లక్ష్యమా? నీమోక్షం నిమిత్తం నీవు కొంచెమైనా ప్రయత్నింప వలదా ?
ప్రశ్నకర్త : అవును. ప్రయత్నించవలసి ఉన్నది.
పొందవలసిన అవసరం లేదా ? ఎంతకాలం ఇలా
బద్దుడవై వుండగలవు?