________________
29
నేను ఎవరిని ?
తొలగించటానికి నీకు సబ్బు కావాలి. ఈ మలినాన్ని తొలగించే ప్రక్రియలో సబ్బుయొక్క అవశేషాలు వస్త్రంపై మిగిలిపోతాయి. ఒక అవశేషాన్ని తొలగిస్తే ఇంకో అవశేషం వస్త్రం పై చోటు చేసుకొంటుంది. అపుడు సబ్బు యొక్క అవశేషాన్ని తొలగించటం కోసం టినోపాల్ ఉపయోగించాలి. అపుడు టినోపాల్ తన అవశేషాలను వృస్త్రం పై మిగిల్చిపోతుంది. ఒకరు స్వప్రయత్నంతో ఆత్మజ్ఞానాన్ని పొందటం సాధ్యంకాదని వివరించటం కోసం ఈ సాదృశ్యము చెప్తున్నాను. ఆత్మజ్ఞానాన్ని పొందకుండా ప్రకృతిని బలహీన పర్చగలమేగాని, ప్రకృతిని నాశనం చేయటం సాధ్యం కాదు. మీరొకసారి ఆత్మఅనాత్మల సహజగుణ విశేషణములను గుర్తించటం జరిగితే మీకు పరిష్కారం లభిస్తుంది. ఈ గుణవిశేషణములను తెలుసుకొనుటలో మీకు జ్ఞానిపురుషుడు సహాయపడగలడు.
జానిపురుషుడు మాత్రమే మీ ఆత్మ అనాత్మలను వేరుపర్చగలడు. ఉదాహరణకి ఈ బంగారు ఉంగరంలో బంగారం మరియు రాగి మిశ్రమంగా ఉన్నాయి. ఈ బంగారాన్ని రాగినుంచి ఎవరు వేరు చేయగలరని నీవు తలుస్తున్నావు?
ప్రశ్నకర్త : కంసాలి మాత్రమే ఆ పని చేయగలడు. దాదా శ్రీ : అవును, ఒక్క కంసాలి మాత్రమే బంగారాన్ని, రాగిని వేరు చేయగలడు, ఎందువల్లనంటే ఆ రెండు మూలకముల యొక్క సహజ గుణములు అతనికి తెలుసు కనుక. అదే విధంగా జ్ఞాని పురుషునికి ఆత్మ అనాత్మల సహజగుణములు తెలిసినందున అతడు ఆ రెంటినీ వేరుచేయగలడు.
ఈ ఉంగరంలో బంగారం, రాగి కాంపౌండు రూపంలో కాక మిశ్రమ రూపంలో ఉన్నాయి. అందువల్లనే కంసాలి తేలికగా మిశ్రమాన్ని వేరుచేయగలడు. అదే విధంగా, ఆత్మఅనాత్మలు కాంపౌండు రూపంలో కాక మిశ్రమ రూపంలో ఉన్నందున ఒక మూలకాన్ని రెండో మూలకం నుంచి వేరు చేయటం సాధ్యం అవుతున్నది. అవి కాంపౌండు రూపంలో ఉన్నట్లయితే వాటిని రెండుగా విభజించటం సాధ్యం కాదు. మిశ్రమ రూపంలో ఉన్నందువల్లనే జ్ఞానిపురుషుడు ఆత్మఅనాత్మలను వేరు చేయగలగటం, ఆ వ్యక్తి ఆత్మానుభూతిని పొందటం సాధ్యమవుతున్నది.