________________
నేను ఎవరిని ?
అంతవరకు, మాయావరణ వల్ల, ఒక వ్యక్తి ఎప్పటికీ “నేను కర్తను మరియు నేను జ్ఞాతను” అని చెప్తాడు, నేను 'కర్తను' మరియు నేను 'జ్ఞాతను' అనే రెండు అభిప్రాయాలు కలిసి ఉన్నపుడు అదే భ్రాంతి (మాయ) అని, జేయము అని చెప్పబడుంది. ఎప్పుడు 'నేను జాతను మరియు ద్రష్టను' అనే మనోభావము 'నేను కర్తను' అనే భావంతో కలవకుండా ఉంటుందో అది జ్ఞాతగా పిలవబడుతుంది.
ఇపుడు నువ్వు 'నేను చందూలాల్' అని నమ్ముతున్నావు. ('నేను' మరియు 'నాది' ఒకటిగా తలుస్తున్నావు). ఆ కారణంగానే ఆత్మ మరియు అనాత్మ ఒకటిగా అయ్యాయి. నిజానికి ఇవి వేర్వేరు వస్తువులు. నువ్వు వేరు మరియు చందూలాల్ వేరు. ఈ భేదాన్ని నీవు గ్రహించనంతవరకు నీవేమి చేయగలవు? ఒక జ్ఞానిపురుషుడు భేదజ్ఞానం ద్వారా నీ కోసం వీటిని వేరు చేయగలడు.
ఆ తర్వాత నిజమైన 'నేను' (నువ్వు) ఏమీ చేయవు. అన్ని పనులూ చందూలాల్ కొనసాగిస్తాడు.
(6) ఈ వైజ్ఞానిక విభజన ఎవరు చేస్తారు?
ఆత్మ - అనాత్మల విజ్ఞాన పూర్వక విభజన. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి ? ఆత్మ (పురుషుడు, స్వస్వరూపము) యొక్క మరియు అనాత్మ (ప్రకృతి ) యొక్క స్వాభావిక గుణములను గురించి తెలిపే జ్ఞానమే ఆత్మ జ్ఞానం. ఎవరైతే ఆత్మ మరియు అనాత్మల యొక్క సహజగుణములను తెలిసికొని
ఉంటారో, మరియు ఈ వైజ్ఞానిక విభజన విధానం (జ్ఞానవిధి) ద్వారా స్వస్వరూపానుభూతిని పొంది ఉంటారో వారిని ఆత్మజ్ఞానం పొందినవారు అని చెప్పవచ్చు. ఆత్మజ్ఞానం పొందినందువల్ల వారికి ఆత్మ అనాత్మల స్వాభావిక గుణభేదముల ఎరుక ఉంటుంది.
నీ అంతట నీవు (స్వప్రయత్నంతో) ఆత్మజ్ఞానమును పొందుట సాధ్యం కాదు. ఎందువల్లనంటే ఇప్పుడు నీవు జీవిస్తునదీ, ప్రవర్తిస్తున్నదీ కూడ ప్రకృతి విభాగంలోనే. ప్రకృతిలో వుంటూ ప్రకృతిని నాశనంచేయ ప్రయత్నిస్తున్నావు. ఇది ఎలా సాధ్యపడుతుంది? నీవు దాని ఉపరితలాన్ని మాత్రమే గీక గలవు గాని ప్రకృతిని సమూలంగా నాశనం చేయలేవు. ఉదాహరణకి, ఈ వస్త్రం మురికి అయితే దానిని