________________
27
నేను ఎవరిని?
కర్తృత్వం కర్మ బంధమౌతుంది ఏవైనా ప్రశ్నలు అడగ దల్చుకొంటే నిస్సంకోచంగా అడుగు. నీవు తెలుసుకొనదల్చినది ఏదైనా సరే అడుగు. ఈ విజ్ఞానం చాలా విలువైనది.
ప్రశ్నకర్త : కర్మ బంధం నుండి ఎలా ముక్తి పొందగలం? దాదాశ్రీ : 'కర్తను' అనే బిలీఫ్ కారణంగానే కర్మలకు ఉనికి ఉంటుంది. కర్మల యొక్క ఉనికి కర్తృత్వం పైనే ఆధారపడివుంది. కర్తృత్వం లేకుంటే కర్మలేదు. నీ మూలస్వభావంలో (ఆత్మస్థానంలో) నీవు ఉన్నట్లయితే కర్తృత్వం లేదు, అందువల్ల కర్మ కూడలేదు. కర్తృత్వం ఉన్నపుడే కర్మ సృష్టింపబడుతుంది. నీవు చందూలాల్ గా 'నేను ఇది చేసాను', 'నేను అది చేసాను' అని నమ్మటంవల్ల, చెప్పటంవల్ల, 'కర్త' వి అవుతున్నావు. ఇదే కర్మకి ఆధారమవుతుంది. నీవు 'కర్త' కాకుండావుంటే కర్మకి ఆధారం వుండదు. ఆధారంలేని కారణంగా అవి పడిపోతాయి. కర్తృత్వం ఉన్నంతవరకే కర్మ ఉంటుంది. ఆత్మ మరియు అనాత్మ అజ్ఞానం వల్ల ఒకటయ్యాయి.
ఆత్మ మరియు అనాత్మ రెండు వేర్వేరు వస్తువులు. అవి రెండూ ఒకటి కాలేదు కానీ ఒక దానినొకటి అతుక్కొని వున్నాయి. ఎలా ? కర్తృత్వ భ్రాంతి అనే భ్రాంతిరసం వల్ల అవి రెండూ అతుక్కొని పోయాయి.
ఈ భ్రాంతిరసం ఎక్కడినుంచి వస్తుంది? ఒకరు "నేను దీనిని చేసాను” అని చెప్పిన క్షణంలోనే ఆత్మయొక్క మరియు అనాత్మ యొక్క రసం (జిగురు పదార్ధం) ఏర్పడుతుంది. ఈ రసం ఎంత జిగటతత్త్వం కల్గిఉంటుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అది విడకుండా ఉంటుంది. ఇంక ప్రతిరోజు ఉత్పన్నమయి దానికి చేర్చబడే కొత్త జిగురురసం గురించి ఏమి చెప్పగలం? ఒక
జ్ఞాని ఈ భ్రాంతి రసాన్ని అంతటినీ తొలగించి ఆత్మని, మరియు అనాత్మని వేరు చేయగలడు. అపుడు ఆత్మ దాని సహజ స్థితిలో ఉంటుంది; మరియు అనాత్మ కూడా దాని సహజస్థితిలో ఉంటుంది. ఎంతవరకు అహంకారం ఉంటుందో