________________
25
నేను ఎవరిని ? కర్తృత్వబుద్ధి= ప్రకృతి : అకర్తాభావం=ఆత్మ ప్రపంచంలోని మనుష్యులందరూ బొంగరాలు. బొంగరం అంటే ఏమిటి? అది ఒక ఆటవస్తువు. ఒక త్రాడును దానికి చుట్టుగా చుట్టి త్రాడుని వెనక్కి లాగినప్పడు దానిముల్లుమొన మీద తిరిగే ఆటవస్తువే బొంగరము. దానిశక్తి పూర్తిగా వ్యయము అయ్యేవరకు గిరగిరా తిరుగుతుంది. ఈ ఉదాహరణలో త్రాడును చుట్టటం
భావపురుషార్ధం (కర్మ) గాను మరియు బొంగరం తిరగటం ప్రారబ్దం (కర్మఫలం) గాను పోల్చవచ్చు. ఒక వ్యక్తి చేత పనులను చేయించేది అతని ప్రకృతి (స్వాభావిక గుణములు), కాని అతను "నేను చేస్తున్నాను” అని చెప్తాడు. వాస్తవానికి అతను కీయిస్తే నడిచే కీలుబొమ్మ. ప్రకృతి అతని చేత తపము, మంత్రజపము, ధ్యానము వంటి వాటిని చేయిస్తే వాటిని చేస్తున్నది తానే అని నమ్ముతాడు.
ప్రశ్నకర్త : దాదాజీ! మాకు ప్రకృతి గురించి చెప్పండి. దాదాశ్రీ : నిన్ను నీవు 'కర్త' అని భావించిన క్షణంలోనే ప్రకృతి ప్రవేశిస్తుంది. ఆత్మవైన నీవు అకర్తవు. 'నేను చందూలాల్' అని మరియు 'నేను కర్తను' అని నీకు రాంగ్ బిలీఫ్ వుంది. దీనిని భావించిన క్షణంలోనే నీవు బంధింపబడుతున్నావు. ఈ రాంగ్ బిలీఫ్ కారణంగానే ప్రకృతి జీవించివుంటుంది. నిజమైన 'నేను' గురించిన అజ్ఞానం ఉన్నంతవరకు వ్యక్తి తనను తాను కర్తగా భావించటం, తన ప్రకృతిచే తాను బంధింపబడటం జరుగుతుంది. 'నేను కర్తను కాదు' అనే ఎరుకను పొందినపుడు కర్తృత్వ భావనపోతుంది. ఇక ప్రకృతి యొక్క ఉనికికి అవకాశమేలేదు. ఆక్షణం నుంచి అతను కొత్త కర్మలవలన బంధింపబడడు. గత కర్మలు మాత్రం మిగిలి ఉంటాయి. అవి అనుభవించటం ద్వారా తొలగిపోతాయి.
కర్త (కర్తృత్వం) మరియు
నైమిత్తిక (సాధనం రూపంలో) కర్త ప్రశ్నకర్త : ఒకరు వాస్తవంలో స్వయంగా కర్త కానట్లయితే మరికర్త ఎవరు? కర్తయొక్క స్వభావం ఏమిటి?