________________
నేను ఎవరిని ?
24
ప్రశ్నకర్త : అవును, అర్ధమయింది.
దాదాశ్రీ : ఇంతమాత్రం నువ్వు అర్థం చేసికొన్నట్లయితే చిక్కు ప్రశ్నని పరిష్కరించటానికి దగ్గరలో ఉన్నట్లే. ప్రజలంతా తపస్సు, జపము, ధ్యానము, ఉపవాసము చేయాలని చెప్తారు. ఇదంతా ఒక భ్రమ. ఇదంతా ఒక మాయ, భ్రమ. ఈ ప్రపంచం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది. అహంకారం లేకుండా ఎప్పటికీ ఉండదు. అది దాని స్వభావం.
అదే జరుగుతుంది....
దాదాశ్రీ : ఏదైనా మన నియంత్రణ వల్లనే జరుగుతుందా? లేక దానికదే
జరుగుతుందా?
ప్రశ్నకర్త : వాటంతట అవే జరుగుతాయి.
దాదాశ్రీ : అవును అన్నీ అవే జరుగుతాయి. ఉదయం నీవునిద్ర లేవటంకూడ అదే జరుగుతుంది. నీవు టీ తాగ్రటం కూడ అదే విధంగా జరుగుతుంది. నీవు టాయిలెట్ చేయటం, నిద్రించటం కూడ వాటంతట అవే జరుగుతాయి. అవి జరిగేటట్లు నీవు చేస్తున్నావా లేక అవే జరుగుతున్నాయా?
ప్రశ్నకర్త : అదే జరుగుతుంది.
దాదాశ్రీ : అవును. కాబట్టి ఈ ప్రపంచంలో అంతా దానికదే జరుగుతుంది. ఇదే ప్రపంచాన్ని గురించిన యదార్ధము. పనులు అవే జరుగుతుంటాయి. కానీ మనుష్యులు 'నేను దీనిని చేస్తున్నాను', 'నేను టాయిలెట్ కెళ్లాను', 'దీనిని నేను చేస్తాను', 'ఈ డబ్బు నేను సంపాదించాను' ఇలా చెప్తుంటారు. ఏదైనా ఒక విషయం దానంతట అదే జరుగుచుండగా మనం 'నేను చేస్తున్నాను' అని చెప్తాము. ఈ విధంగా మనం కొత్త కర్మను సృష్టించుకొంటున్నాము (కొత్త కర్మకు బీజాలు నాటుతున్నాము). కొత్తగా కర్మను సృష్టించుకొనడం (ఛార్జింగ్) నీవు ఆపినట్లయితే స్వేచ్ఛను పొందుతావు. జ్ఞానప్రాప్తి లేకుండా కొత్త కర్మల సృష్టిని ఎవరూ ఆపలేరు.