________________
నేను ఎవరిని ? నిందిస్తే ఆకేసు ఎవరు పెట్టాలి? ఇటువంటి నేరారోపణలు మరుజన్మలో భయంకరమైన బంధాలకు కారణమౌతాయి. భగవంతుని ఎవరైనా నిందించగలరా?
ప్రశ్నకర్త : లేదు.
దాదా శ్రీ : కొన్ని సందర్భాలలో ప్రజలు తమ పొరపాటును, తప్పులను ఒప్పుకోకుండా రకరకాల కారణాలను చెప్తుంటారు. మనిషెన్నడూ తన తప్పులను తాను అంగీకరించడు. గ్రహాలు అనుకూలంగా లేవు, భాగస్వామి మోసం చేసాడు. ఇలాంటి వంకలు చెప్తారే తప్ప దోషాన్ని తమ నెత్తి పై వేసుకోరు. ఒకసారి ఒక విదేశీయుడు నాతో “మీ
భారతీయులు నేరాన్ని తమపై వేసికోరెందుకు?' అన్నాడు. అపుడు నేను 'అదే ఇండియన్ పజిల్. అన్ని పజిల్స్ కంటే పెద్దది' అన్నాను. 'భారతీయులు తమ తప్పుని ఒప్పుకోరు, అదే విదేశీయులైతే చాలా హుందాగా తమ తప్పులను అంగీకరిస్తారు' అన్నాను.
కర్తృత్వంలో విరుద్ధత సంయోగం (పరిస్థితులన్నీ సమకూడటం) దానంతట అదే జరుగుతుంది. అలాగే వియోగం (పరిస్థితులు సమకూడకపోవటం) కూడ. కానీ అన్నీ సవ్యంగా వుంటే 'నేను చేసాను' అని మనిషి గర్వపడతాడు. ఏదైనా నష్టంవస్తే విశ్వాసాన్ని కోల్పోయి 'నేను ఏమి చేయగలను?' అంటాడు.
ప్రశ్నకర్త : అవును. కొన్నిసార్లు నేనూ అలాగే చెప్తాను. దాదా శ్రీ : నీవు 'కర్తవు' అయినపుడు 'నేనేమి చేయగలను?' అని ఎన్నడూ అనవు. ఉదాహరణకి ఏదైనావంట బాగా కుదిరిందని, రుచిగా వుందని తిన్నవాళ్లు చెప్తే 'నేనే చేసాను' అని దానిని చేసిన వారు గర్వపడతారు.
కానీ ఆ పదార్ధం రుచిగా లేకపోవటమో, మాడిపోవటమో జరిగితే 'నేనేమి చేయను? పిల్లలు విసిగిస్తున్నారు, ఫోను అదే పనిగా
మ్రోగుతూ ఉంది, స్టామంట ఎక్కువైంది' ఇలా ఎన్నో సాకులు చెప్తారు. అందరూ ఇలాగే మాట్లాడుతుంటారు. ఒకరోగి అనారోగ్యం నుంచి కోలుకుంటే అతనికి వైద్యం చేసిన డాక్టరు 'నేను ఇతని ప్రాణాలు కాపాడాను' అంటాడు. రోగి చనిపోతే 'నేనేమి చేయను?' అంటాడు. ఇలాంటి పొందికలేని, పునాదిలేని సమాధానాలు దేనికి ?