________________
నేను ఎవరిని ?
దాదాశ్రీ : ఒకరి కర్తృత్వం కేవలం నైమిత్తికం (పరికరంమాత్రమే). దేనికీ ఏ విషయంలోనూ ఎవరూ స్వతంత్రకర్తకాదు.
26
ఈ నైమిత్తిక కర్తృత్వాన్ని పార్లమెంటరీ పద్ధతిలో ఇలా నిర్వచించవచ్చు. పార్లమెంటులో ఏదైన ఒక విషయంలో అంతిమ నిర్ణయం సామూహిక ఓట్లబలంపై ఆధారపడి వుంటుంది. ప్రతి ఒక్కరికీ ఒక్క ఓటు మాత్రమే ఉంటుంది. అనేక మంది ఓట్లలో నీదికూడ ఒక్క ఓటు మాత్రమే. కానీ నువ్వు “నేను చేస్తున్నాను” అని నమ్ముతావు కనుక నువ్వు 'కర్త' అవుతున్నావు.
ఈవిధమైన భావపురుషుషార్ధం ద్వారా నీకు నీవే ప్లాన్ వేసుకొని కర్తృత్వబుద్ధి ద్వారా ప్లానింగ్ కి ఆమోదముద్రవేస్తున్నావు. కర్తృత్వభావం ద్వారా కొత్త కర్మలను సృష్టించుకొంటున్నట్లు (భవిష్యత్కి ప్లాన్ వేసుకొంటున్నట్లు) ప్రపంచంలో ఎవరికీ తెలియదు. 'కర్త' అయినవారు 'భోక్త' కూడ కావలసే వుంటుంది. ఇంకోమాటలో చెప్పాలంటే ఈ జన్మలో మనకు అనుభవమయ్యేదంతా పూర్వజన్మలోని మన భావరూపప్లానింగ్కి ఫలము. 'కర్తృత్వం అనేది భావరూపంలోనే వుంటుంది.
చందూలాల్ అంతరంగం అనే చిన్న కంప్యూటర్ యొక్క ఔట్పుట్ సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్ అనే పెద్దకంప్యూటర్కి ఇన్పుట్ గా మారుతుంది. ఈ విధంగా ప్లానింగ్ (భావపురుషార్ధం) పెద్ద కంప్యూటర్లోకి ఫీడ్ అవుతుంది. అపుడు పెద్దకంప్యూటర్ ఈ ప్లానింగ్ కి ఫలితాలను యిస్తుంది. ఒకరి జీవితంలోని సంఘటనలు అన్నీ ఫలరూపమే. గత జన్మలో మనం సృష్టించుకొన్న కారణాలకి (కర్మలకి) ఫలమే ప్రస్తుత జన్మలోని డిశ్చార్జిరూప ఘటనలు. ఈ జన్మకి సంబంధించిన వేటినీ తాను కంట్రోల్ చేయటానికి వీలులేదు. అది ఇంకొకరి అధీనంలో ఉంటుంది. ఒకసారి ప్లానింగ్ జరిగాక అది ప్లాన్ చేసిన వారి చేయిదాటి ఇంకొకరి అధీనంలోకి, ఇంకొకరి చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆ ఇంకొకరు సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్ (వ్యవస్థిత్ శక్తి). ఆప్లాన్ క్రియారూపందాల్చి ఫలితాలను ఇవ్వటం కోసం ప్రాసెసింగ్ జరుగుతుంటుంది. ఫలితాలు ఊహించినదానికంటె భిన్నంగా ఉండవచ్చు. డిశ్చార్జి కర్మ యొక్క ఫలితాలు పూర్తిగా పరాధీనం. ఇది చాలా సూక్ష్మవిషయం. ఇది నీకు అర్ధమయిందా?
ప్రశ్నకర్త : అర్ధమయింది దాదా!