________________
37
నేను ఎవరిని ?
మీరు జ్ఞానం పొందే సమయంలో ఏమి జరుగుతుంది?
జ్ఞానవిధి సమయంలో మూడు రకాల కర్మలలో రెండింటిని జ్ఞానాగ్ని దగ్ధం చేస్తుంది. మూడు రూపాల కర్మలను ఆవిరి, నీరు మరియు మంచుగడ్డతో పోల్చవచ్చు.
జ్ఞానవిధి సమయంలో మొదటి రెండు రకాల కర్మలు (ఆవిరి మరియు నీరు) నాశనం చేయబడతాయి. అందువల్ల వారికి తాము తేలిక అయినట్లు అనుభూతి కలుగుతుంది, వారి జాగృతి కూడ పెరుగుతుంది.
ఇక మిగిలి వుండేది ఘనీభూతమైన (మంచుగడ్డ రూపంలోని) కర్మలు మాత్రమే. ఆకర్మఫలాన్ని (మంచి లేక చెడు ఏదైనా) మీరు అనుభవించి తీరాలి, ఎందువల్లనంటే అవి ఘనీభవించి ఉండటంతో పాటు ఫలాలను యివ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని మీరు తప్పించుకోలేరు. ఆవిరి మరియు నీటి రూపంలో ఉన్న కర్మలు జ్ఞానాగ్నిలో ఇగిరిపోతాయి. ఇది మీకు భారము తగ్గిన అనుభూతిని కల్గించి, జాగృతిని వృద్ధిచేస్తుంది. ఒకరి కర్మలు నాశనం గావింపబడనంతవరకు వారి జాగృతి వృద్ధి చెందదు. ఘనీభూతమైన కర్మలను మాత్రమే సహించవలసి వుంటుంది. ఈ ఘనీభూత కర్మలను తేలికగా సహించగలగటం కోసమూ, ఆ కర్మఫల తీవ్రతను తగ్గించటం కోసమూ మీకు అన్ని మార్గాలూ చూపాను. 'దాదా భగవాన్ కే అసీమ జయ జయ కార్ హో' అని మరల మరల చెప్పండి; త్రిమంత్రము మరియు నవకల్మ్ చెప్పండి. (నవకల్మ్ కోసం పుస్తకం చివర చూడండి).
జ్ఞానవిధి సమయంలో ఈ తేలికపాటి కర్మలు (ఆవిరి, నీటి రూప కర్మలు) భస్మీభూతం కావటంతో పాటు అనేక ఆవరణలు (ఆత్మపై ఉన్న అజ్ఞానపు పొరలు) తొలగింపబడతాయి. ఆ సమయంలో దివ్యానుగ్రహం ద్వారా వారి ఆత్మ జాగృతమవుతుంది. ఒకసారి జాగృతమైన తర్వాత ఆ జాగృతి ఎప్పటికీ వదిలిపోదు. జాగృతితో పాటు నిరంతర ప్రతీతి (నేను శుద్ధాత్మను అనే దృఢ నిశ్చయం) ఉంటుంది. జాగృతి ఉన్నంత కాలమూ ప్రతీతి నిల్చి వుంటుంది. మొదట జాగృతి యొక్క అనుభవం కల్గుతుంది. తర్వాత ప్రతీతి వస్తుంది. ప్రతీతి అనగా “నేను శుద్ధాత్మను” అనే దృఢ విశ్వాసము. జ్ఞానవిధి వల్ల అనుభవం, లక్ష్యము (జాగృతి) మరియు ప్రతీతి (దృఢ విశ్వాసము) ఇవి మూడూ చోటు చేసుకుంటాయి. ప్రతీతి